ప్రస్తుతం ఇండియాలో జరుగుతున్న మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఆస్ట్రేలియా సరికొత రికార్డు సృష్టించింది. ఆదివారం విశాఖపట్నంలో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు మరోసారి టీమిండియాను చిత్తు చేసింది. ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా కెప్టెన్ అలిస్సా హీలీ (142; 107 బంతుల్లో 21×4, 3×6) మెరుపు సెంచరీతో.. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది. ఇది వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్. మహిళల వన్డే క్రికెట్ చరిత్రలోనే 331 పరుగులు సక్సెస్‌ఫుల్ రన్ ఛేజ్…