ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ అరుదైన క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. రాజ్‌కోట్ వేదికగా భారత జట్టుతో ఇవాళ ( బుధవారం ) జరుగుతున్న మూడో వన్డేలో 5000 రన్స్ మార్కును అందుకున్నాడు. తద్వారా ఆసీస్ తరఫున వన్డేల్లో ఈ మార్కును చేసిన 17వ క్రికెటర్‌గా స్మిత్ రికార్డుల్లోకెక్కాడు.