West Indies recall Rahkeem Cornwall for First Test vs India: జూలై 12 నుంచి వెస్టిండీస్, భారత్ జట్ల మధ్య టెస్ట్ సిరీస్ మొదలవనుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ ఇదివరకే భారత జట్టుని ప్రకటించగా.. తాజాగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా టీమ్‌ను ప్రకటించింది. అయితే కేవలం తొలి టెస్టు కోసమే 13 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. క్రెగ్ బ్రాత్‌వైట్ కెప్టెన్‌గా కొనసాగనుండగా.. విండీస్ బాహుబలి రకీం కార్న్‌వాల్ రి-ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు ఇద్దరు బ్యాటర్లు తొలిసారి విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో రాణించిన అలిక్ అథనాజ్, కిర్క్ మెకంజీ తొలిసారిగా విండీస్ టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 30 మ్యాచ్‌లు ఆడిన అథనాజ్.. 1825 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. 9 మ్యాచ్‌లు ఆడిన మెకంజీ.. 591 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ ఉంది. వీరిద్దరు ఇటీవల బంగ్లాదేశ్- ఏ జట్టుతో జరిగిన మూడు మ్యాచ్‌ల అనధికారిక సిరీస్‌లో ఆడాడు. అథనాజ్ 220, మెకంజీ 209 పరుగులు బాదారు. చీఫ్ సెలెక్టర్ డెస్మండ్ హేన్స్ ఈ యువ ఆటగాళ్లకు సుదీర్ఘ భవిష్యత్తు ఉందని అభిప్రాయపడ్డారు.
Also Read: No Leave in 74 Years: సూపర్ వుమెన్.. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా 74 ఏళ్ల పాటు డ్యూటీ!
వెస్టిండీస్ ఆల్‌రౌండర్, విండీస్ బాహుబలి రకీం కార్న్‌వాల్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. 2021 తర్వాత తొలిసారి జట్టులోకి వచ్చాడు. స్పిన్నర్ గుడాకేష్ మోటీకి గాయం కావడంతో రకీంకు చోటు దక్కింది. రకీం 2019లో భారత జట్టుపైనే అరంగేట్రం చేయడం విశేషం. ఇక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ట్వీకర్ జోమెల్ వారికన్ కూడా జట్టులోకి వచ్చాడు. జైడెన్ సీల్స్, కైలీ మేయర్స్ కూడా గాయాల కారణంగా సెలక్షన్‌కు అందుబాటులో లేరు. ట్రావెలింగ్ రిజర్వ్స్ ఆటగాళ్లుగా టెవిన్ ఇమ్లాచ్, అకీమ్ జోర్డాన్ ఉన్నారు.
తొలి టెస్టుకు వెస్టిండీస్ జట్టు ఇదే:
క్రెగ్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), జెర్మైన్ బ్లాక్‌వుడ్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనాజ్, తగ్‌నరన్ చందర్‌పాల్, రకీం కార్న్‌వాల్, జాషువా డా సిల్వా, షానన్ గాబ్రియేల్, జేసన్ హోల్డర్, అల్జారీ జోసెఫ్, కిర్క్ మెకంజీ, రేమన్ రీఫర్, కీమర్ రోచ్, జోమెల్ వారికాన్.
Also Read: Asian Games 2023 BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఏషియన్ గేమ్స్ 2023లో టీమిండియా!