NTV Telugu Site icon

Mahesh Kumar Goud: కొండా సురేఖ – రేవూరి అంశంపై స్పందించిన పీసీసీ చీఫ్..

Congress

Congress

మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు. మంత్రి , ఎమ్మెల్యే ఇరువురి తో మాట్లాడినట్లు తెలిపారు.ఈ అంశంపై మాట్లాడాలని ఇన్‌ఛార్జి మంత్రికి చెప్పామన్నారు. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి వివాదం పార్టీ అంతర్గత సమస్య త్వరలో సమసిపోతుందని స్పష్టం చేశారు. మరోవైపు ఎమ్మెల్యే పోచారం, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి పై మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షునికి బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలకు నష్టం జరగకుండా సామరస్యంగా సమస్య పరిష్కరిస్తామన్నారు.

READ MORE: Minister Nimmala Rama Naidu: నవంబర్ నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు పునః ప్రారంభం

అసలు ఏం జరిగింది?
వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయటకు వచ్చాయి. కొండ వర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఆదివారం కొండా వర్గం రేవూరి వర్గం మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది. దసరా బతుకమ్మ వేడుకల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్యే రేవూరి పేరు లేకపోవడంతో వివాదం మొదలైంది. ఎమ్మెల్యే పేరు పెట్టాలంటూ కొండ వర్గానికి రేవూరి అనుచరులు సూచించారు. రేవూరి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు పెట్టడంతో ఫ్లెక్సీలను చించేశారు. ఫ్లెక్సీలు చించి వేసారంటూ రేవూరి అనుచరులపై కొండ వర్గం దాడికి పాల్పడ్డారు. దీంతో గాయాల పాలైన రేవూరి అనుచరులు కొండ వర్గంపై ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని కొండ అనుచరులను అరెస్ట్ చేశారు. ఆధారాలు లేకుండానే తమ కార్యకర్తలను అరెస్ట్ చేశారంటూ కొండ అనుచరులు పేర్కొన్నారు.. గీసుకొండా పోలీస్ స్టేషన్ పరిధిలో 16వ డివిజన్ నర్సంపేట రహదారిపై కొండా వర్గం ధర్నాకు దిగింది. పోలీసులు అదుపులోకి తీసుకున్న తమ వర్గానికి చెందిన కార్యకర్తలను విడుదల చేయాలంటూ ఆందోళన చేపట్టారు. ధర్నా చేస్తున్న కార్యకర్తలపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. సమస్య వివాదాస్పదం కాకుండా రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలకు నచ్చచెప్పి ట్రాఫిక్ ని క్లియర్ చేశారు. ఈ ధర్నాతో మరోసారి కొండ, రేవూరి ఆధిపత్య పోరు మరోసారి బట్టబయలైంది.

Show comments