మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వివాదంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. పరకాలలో కార్యకర్తల అత్యుత్సాహం వల్లే ఇద్దరి మధ్య వివాదం చెలరేగిందన్నారు.
వరంగల్ జిల్లాలో మరోసారి కాంగ్రెస్‌లో వర్గ విభేదాలు బయటకు వచ్చాయి. కొండ వర్గానికి రేవూరి ప్రకాష్ రెడ్డి వర్గానికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. కొండా వర్గం రేవూరి వర్గం మధ్య ఫ్లెక్సీల వివాదం చెలరేగింది.