Wine Shops : గ్రీష్మకాలం సమీపిస్తున్న వేళ మద్యం ప్రియులకు ఊహించని షాక్. ఎండల వేడి నుండి కాస్త ఉపశమనం కోసం బీర్లు, మద్యం ఆశ్రయించే మందుబాబులకు, ఈ నెల 14వ తేదీ ప్రత్యేకంగా చేదు అనుభవం కలిగించనుంది. నగర పోలీసులు హోలీ పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లకుండా, సామాజిక అసౌకర్యాన్ని నివారించేందుకు పోలీసులు ముందస్తు జాగ్రత్త చర్యలు…
35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ, రంజాన్ మాసములోని రెండవ శుక్రవారం ఒకే రోజు వచ్చాయని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. రెండు పండుగలు సజావుగా జరిగేందుకు ముందస్తు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా సీవీ ఆనంద్ , సిటీ పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ప్రతి జోన్ లోని సున్నితమైన, ముఖ్యమైన ప్రాంతాలలో పికెట్ లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుని…
భారతదేశంలో హోలీ సంబరాలు మొదలైయ్యాయి.. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా, కుల మత భేదాలు లేకుండా అందరు కలిసి జరుపుకొనే పండుగ.. ఈ హోలీ పండుగను ఒక్కో ప్రాంతంలో జరుపుకుంటారు.. అయితే చాలా మందికి హోలీని ఎందుకు జరుపుకుంటారు అనే సంగతి గురించి తెలియదు. హోలీ పండుగ రోజుకు పెద్ద చరిత్ర ఉందని పండితులు చెబుతున్నారు.. మరి ఈ హోలీ పండుగను ఎందుకు జరుపుకుంటారో? ఎలా పూజ చేసుకోవాలో? ఇప్పుడు వివరంగా మనం తెలుసుకుందాం.. విష్ణు…
ఈసారి హోలీ పండుగను మార్చి 25న జరుపుకుంటున్నారు. సహజంగానే, పిల్లల ఆనందం లేకుండా ఏ పండుగ అయినా అసంపూర్ణంగా ఉంటుంది. హోలీ అంటేనే రంగుల పండగ. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఉత్సాహంగా.. ఉల్లాసంగా చేసుకునే పండగ హోలీ. హోలీ వస్తుందంటే చాలు దేశమంతా అందరూ పండుగ చేసుకునేందుకు సిద్ధంగా ఉంటారు
హోలీ భారతదేశంలోని పెద్ద, ప్రసిద్ధ పండుగలలో ఒకటిగా పరిగణించబడుతుంది. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా చాలా చోట్ల దీని ఆదరణ కనిపిస్తోంది. ఇదిలా ఉంటే.. మన దేశంలో హోలీ పండుగను జరుపుకోని చాలా ప్రదేశాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
భారతదేశ ప్రజలు హోలీ పండుగకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. రంగులు జల్లుకుంటూ ప్రతీ ఒక్కరు సంబరాలు జరుపుకునే ఈ పండుగ కోసం.. ప్రతీ ఒక్కరు ఎదురు చూస్తుంటారు. దేశంలో ప్రతీ వీధి, ప్రతీ ప్రాంతం రంగులతో నిండిపోయే ఏకైక వేడుక ఇదే. అయితే హోలీ జరుపుకోవడంలో ప్రతీ ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అందుకనే ఉన్నవాటిలో ఉత్తమమైనవి ఏవో తెలుసుకుంటే.. ఈ సారి హోలీని ఎంజాయ్ చేయడానికి ముందుగానే సిద్ధం కావచ్చు. ఇండియాలో హోలీ జరుపుకునేందుకు బెస్ట్…
హోలీ పండుగ రోజునే చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న జరగనుంది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది హోలీ, చంద్రగ్రహణం ఒకేరోజు వస్తున్నాయి. కాబట్టి హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనుమానం చాలామందిలో ఉంది.