DoubleISMART: డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఏంటంటే..?
- గ్రాండ్ రిలీజ్ కు డబుల్ ఇస్మార్ట్ రెడీ
- మిస్టర్ బచ్చన్ తో పోటీగా రానున్న శంకర్
- డబుల్ ఇస్మార్ట్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ చూడలేదు వీరిద్దరు. అటువంటి సక్సెస్ ని మరోసారి చూసేందుకు మూడేళ్ళ తర్వాత మరోసారి కలిశారు రామ్, జగన్నాథ్. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి, పూరి స్వయంగా నిర్మిస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కానున్న ఈ చిత్రంపై ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ పేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Also Read : CommitteeKurrollu: అదరగొడుతున్న కమిటీ కుర్రోళ్ళు 5 రోజుల కలక్షన్స్ ఎంతంటే..?
Also Read
భారీ బడ్జెట్ పై తెరకెక్కిన ఈ సినిమాలు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. డబుల్ ఇస్మార్ట్ టికెట్స్ రేట్లు పెంచుకునేందుకు చిత్ర నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరగా అందుకు అనుమతులు ఇచ్చింది. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ కు ప్రతి టికెట్ పై 35 రూపాయలు పెంచుకునే విధంగా స్పెషల్ జీవో జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. మొదటి 10రోజులు మాత్రమే పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. మరోవైపు డబుల్ ఇస్మార్ట్ కు పోటీగా రిలీజ్ కాబోతున్న మిస్టర్ బచ్చన్ అధిక రేట్లు కోసం అప్లై చేసిందో లేదో ఇక క్లారిటి లేదు. ఇటు తెలంగాణలో మాత్రం సాధారణ ధరలకే ఈ సినిమా ప్రదర్శించనున్నారు. అందుకు సంభందించి బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. ఎన్నో తర్జన భర్జనలు,పంచాయతీలు, నష్ట పరిహారాల చర్చల అనంతరం డబుల్ ఇస్మార్ట్ ను నైజాంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హనుమాన్ చిత్ర నిర్మాత నిరంజన్ రెడ్డి పంపిణి చేస్తున్నాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!