Viral Video: చాలా భయంగా ఉంది.. చీర్ గర్ల్ షాకింగ్ వీడియో..!
- ఐపీఎల్ 2025లో ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే రద్దు.
- పాకిస్తాన్ జమ్మూకు దాడి చేసిన తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా మ్యాచ్ నిలిపివేత.
- స్టేడియంలోని ప్రేక్షకులను ఖాళీ చేయించారు
- చీర్ గర్ల్ సెల్ఫీ వీడియోలో తన భయాన్ని వ్యక్తం చేస్తూ భావోద్వేగంతో మాట్లాడింది.
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Viral Video: ఇండియా – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు క్రీడా రంగంపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఆటలే కాదు, వాటికి సంబంధించిన ప్రతి వ్యక్తి భద్రత కూడా ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రోజున ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా అడ్డుకుంది. అయినా భద్రతా కారణాల దృష్ట్యా, మ్యాచ్‌ను వెంటనే నిలిపివేశారు.
Read Also: Operation Sindoor 2: ఎల్వోసీ, ఐబీ వెంట పాక్ విఫలయత్నం.. 50కి పైగా డ్రోన్లను తుక్కు చేసిన భారత్
Also Read
- YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
- Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
- Aus vs Ban: ఆస్ట్రేలియాకు దెబ్బ మీద దెబ్బ.. బంగ్లాదేశ్ బౌలర్ల ధాటికి పరుగుల ఖాతా తెరవకముందే మూడు వికెట్లు డౌన్.!
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
సెక్యూరిటీ అధికారుల ఆదేశాల మేరకు, స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను వెంటనే బయటకు పంపించారు. గ్రౌండ్ లైట్స్ అన్నింటినీ ఆఫ్ చేసి, అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ పరిణామాలు ప్రేక్షకుల్లో, మ్యాచ్‌కు హాజరైన సిబ్బందిలో తీవ్ర ఆందోళనను కలిగించాయి. ఇలా ఉండగా, మ్యాచ్‌కి చీర్ గర్ల్‌గా వ్యవహరిస్తున్న ఓ మహిళ తన మొబైల్ ఫోన్లో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
Read Also: Samba : సాంబా సెక్టార్లో ఉగ్ర కుట్ర.. 10 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతం
ఈ వీడియోలో ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, “ఇక్కడ చాలా భయంగా ఉంది. అన్ని లైట్స్ ఆఫ్ చేశారు. మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నట్టుగా ఉంది” అంటూ భావోద్వేగంతో మాట్లాడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఘటనపై బీసీసీఐ స్పందిస్తూ, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా ఆటను నిలిపివేయడం తప్పనిసరి అయిందని పేర్కొంది. ఆటగాళ్లు, ప్రేక్షకులు, సిబ్బంది భద్రత ప్రాధాన్యత అని.. ప్రభుత్వం, భద్రతా సంస్థల సూచనల మేరకు మరిన్ని మ్యాచ్‌లపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
"Very very scary" – Cheer leader's SHOCKING video from Punjab Kings Vs Delhi Capitals IPL match in Dharamshala. pic.twitter.com/S830aDKer3
— Manobala Vijayabalan (@ManobalaV) May 8, 2025
తాజావార్తలు
-
AirAsia: ఆలస్యమైన విమానం.. రైతు అరుదైన హైబ్రిడ్ పనస మొక్క దెబ్బతినడంతో రూ. 90 వేల నష్టపరిహారం
-
Vadde Naveen : బాహుబలి కంటే పుష్పనే స్పెషల్… స్టార్స్ సినిమాలపై వడ్డే నవీన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
-
YS Jagan: డీఎస్సీలో భారీ అక్రమాలు.. ఫస్ట్ ర్యాంకర్‌కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు!
-
TATA Sierra EV: టాటా సియెర్రా ఈవీ రిలీజ్ కు రెడీ..! 500KM రేంజ్, ప్రీమియం ఫీచర్లు
-
Wedding Card Vastu Tips: పెళ్లిళ్ల సీజన్ వచ్చేస్తోంది.. వాస్తు ప్రకారం మీ వెడ్డింగ్ కార్డ్ ఇలా ఉంటేనే శుభప్రదం! ఈ తప్పులు అస్సలు చేయకండి!
ట్రెండింగ్
-
Mohammed Siraj Wedding: హీరోయిన్‌తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్‌లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్‌కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్‌లైన్ మ్యాప్స్‌తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్‌తో Realme P4R 5G లాంచ్..