Viral Video: ఇండియా – పాకిస్తాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు క్రీడా రంగంపైనా ప్రభావం చూపిస్తున్నాయి. ఆటలే కాదు, వాటికి సంబంధించిన ప్రతి వ్యక్తి భద్రత కూడా ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రోజున ధర్మశాలలో జరగాల్సిన ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ అర్ధాంతరంగా రద్దయింది. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం దాడులకు పాల్పడింది. ఈ దాడులను భారత ఆర్మీ విజయవంతంగా…