Double Ismart: ఆగస్టు 15 విడుదల కాబోతున్న సినిమాలలో ఒకటి డబల్ ఇస్మార్ట్. రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతున్న సినిమా “డబల్ ఇస్మార్ట్”. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో నేడు సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను సినిమా బృందం వరంగల్ నగరంలో ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాకు సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈ నేపధ్యంలో సినిమాకు ప్రొడ్యూసర్ గా ఉన్న హీరోయిన్ ఛార్మి (Charmy Kaur) చాలా సింపుల్ గా.. సుత్తి లేకుండా మాట్లాడింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
Veekshanam: రామ్ కార్తీక్ హీరోగా ‘వీక్షణం’ ఫస్ట్ లుక్ రిలీజ్..
మళ్లీ వచ్చేసాము మీ ఊరు.. ఇస్మార్ట్ శంకర్ కి ఇక్కడే ప్రి రిలీజ్ ఈవెంట్ చేసాం.. మేము అప్పుడే మీ అందరికీ ప్రామిస్ చేసాం.. ఇస్మార్ట్ శంకర్ తర్వాత మళ్లీ డబల్ ఇస్మార్ట్ తీసిన తర్వాత వరంగల్ లోనే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ పెడతాము. 2019లో ఇస్మార్ట్ శంకర్ ను చాలా పెద్ద విజయం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 15 ముందుకు రాబోతోంది డబల్ ఇస్మార్ట్. సినిమాలోని అన్ని పాటలను బాగా హీట్ చేశారని., ట్రైలర్ సంబంధించిన రెస్పాన్స్ కూడా బాగుందని.. ఇంతకుమించి తాను మాట్లాడనని ఆగస్టు 15 రోజు హిట్ కొట్టిన తర్వాత అప్పుడు మాట్లాడతాను అంటూ ధన్యవాదాలు తెలిపింది.