Torture : కట్టుకున్న భర్త చిత్రహింసలు తట్టుకోలేకపోయింది ఓ భార్య. 30ఏళ్లుగా తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తూనే ఉన్నాడు. కన్న బిడ్డలపై కూడా కనికరం లేదు. వారిని తిడుతుంటే అడ్డుకున్న భార్యపై దాడి చేసేవాడు. భర్త పెడుతున్న చిత్రహింసలు తట్టుకోలేని భార్య షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎలాగైన తన భర్తను మట్టుబెట్టాలని నిర్ణయించుకుంది. తన పిల్లలతో కలిసి భర్తను చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని కారులో ఎక్కించి ఇంటి నుంచి తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. చనిపోయిన వ్యక్తి పేరు శత్రుహన్ సాహు. శత్రుహన్ సాహుపై గతంలో పోలీస్ స్టేషన్లో అనేక కేసులు నమోదయ్యాయి. అతను చిల్ఫీ ప్రాంతంలో పేరుమోసిన పోకిరి. హత్య కేసులో శత్రుహన్ భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, కుమార్తెను పోలీసులు అరెస్టు చేశారు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు శత్రుహన్ ఇంటికి చేరుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.
Read Also : Father: ఆ తండ్రి గురించి తెలుసుకోవాల్సిందే.. కూతురి చికిత్స కోసం రక్తాన్ని దారబోశాడు.. కానీ చివరకు!
పోలీసులు విచారణ నిమిత్తం శత్రుహన్ ఇంటికి వచ్చారు. ఈ సమయంలో, పోలీసులు ఇంటి బయట పార, కారును కడిగి శుభ్రం చేయడం చూశారు. అయితే పోలీసులు కారుపై రక్తపు మరకలను గుర్తించారు. ఇది చూసిన పోలీసులు కుటుంబ సభ్యులను తమ స్టైల్లో విచారించారు. విచారణలో మృతుడి భార్య వాస్తవాలను చెప్పింది. మృతుడు శత్రుహన్ గత 30 ఏళ్లుగా భార్యను శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నాడు. దీని తర్వాత కుమారుడి పెళ్లి తర్వాత కోడలుపై కూడా దుష్ప్రచారం చేసేవాడు. ఆమె ప్రతిఘటిస్తే భార్యను కొట్టేవాడు.
Read Also : Pithani Satyanarayana: జనసేన, టీడీపీ పొత్తుపై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఎంత కాలం అడ్డుకుంటారు..?
రోజూ పడుతున్న బాధలతో విసిగిపోయిన తల్లి, పిల్లలు కలిసి అతడిని హత్య చేశారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని కారులో ఎక్కించి కొంతదూరం తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేశారు. నిందితులు నేరం అంగీకరించడంతో వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. శత్రుహన్ కోడలు ఆరు నెలల గర్భిణి కాగా, చిన్న కొడుకు మైనర్. ఈ నేపథ్యంలో పోలీసులు తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.