ఏపీలో దాదాపు రూ. 600 కోట్ల వ్యయంతో 4 వేల పై చిలుకు ఆలయాలు నిర్మించామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దుర్గ ఆలయం, శ్రీశైలం దేవస్థానంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. శ్రీశైలంలో వసతి కొరత ఉందని.. కొత్తగా 750 గదుల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. 3 స్టార్ వసతులతో బిల్ట్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానంలో వసతి నిర్మాణం చేపడుతున్నామన్నారు. అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల తదితర దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి…