Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
- పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట..
- 9 నెలల తర్వాత జైలులో భార్య, సోదరితో భేటీ..
- పాక్ సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కీలక సమావేశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి మరియు పాకిస్తాన్ తెహ్రీక్-ఎ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు అయిన ఇమ్రాన్ ఖాన్ దాదాపుగా 9 నెలల జైలు జీవితం తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని కలుసుకునేందుకు అనుమతి లభించింది. ఆయన భార్య బుష్రా బీబీ, సోదరి నూరిన్ నియాజీలు రావల్పిండిలోని అడియాలా జైలులో ఆయనను పరామర్శించారు. పాక్ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ఇమ్రాన్ ఖాన్‌ను కలుసుకునేందుకు ఆయన కుటుంబీకులు, పీటీఐ నేతల్ని అనుమతించడం లేదు. జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ప్రతి వారం తన కుటుంబ సభ్యులను కలుసుకోవడానికి అనుమతిస్తూ సుప్రీం కోర్టు ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల నేపథ్యంలో ఈ భేటీ జరిగింది.
ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, జైలు నుంచి ఆస్పత్రికి తరలించి చికిత్స అందించాల్సిందిగా పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పాక్ మీడియా నివేదిక ప్రకారం.. నూరిన్ నియాజీ ఈ ఏడాది మొదటిసారిగా ఇమ్రాన్ ఖాన్‌ను కలిశారు. ఈ సమావేశం తర్వాత ఆమె తన సోదరుడి ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య పరీక్షల కోసం షిఫా ఇంటర్నేషనల్ ఆస్పత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే, కుటుంబీలకుల్ని కలుసుకునే క్రమంలో రాజకీయాల ప్రస్తావన తేస్తే తమ ఆదేశాల్ని రద్దు చేసుకుంటామని సుప్రీంకోర్టు షరతు విధించింది. రెండు రోజుల్లోగా ఇమ్రాన్ ఖాన్‌ను షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఆయనను ఆసుపత్రిలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది.
Also Read
- China swine Flu Case: చైనాలో తొలిసారి మనిషికి స్వైన్ ఫ్లూ A(H1N2)v.. భారత్‌కు ముప్పు ఎంత?
- Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
- ChatGPT for Teens: టీనేజర్లకు చాట్‌జీపీటీపై కఠిన ఆంక్షలు.. ఓపెన్ఏఐ కీలక నిర్ణయం.. ఇవే కొత్త ఫీచర్లు
- Sheikh Hasina: షేక్ హసీనా అప్పగింతపై కేంద్రం కీలక ప్రకటన
తాజావార్తలు
-
Pakistan: ఇమ్రాన్ ఖాన్‌కు ఊరట.. 9 నెలల తర్వాత భార్య, సోదరిని కలిసిన మాజీ ప్రధాని..
-
Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
Ram Pothineni: అనారోగ్యంతో ఉన్న అభిమానితో హీరో రామ్ వీడియో కాల్.. భోజనం చేసి మందులు వేసుకో.. నన్ను కలవొచ్చు
-
WTC Points Table 2026: శ్రీలంకపై ఘన విజయం.. పాయింట్ల పట్టికలో టీమిండియాకు భారీ లాభం!
ట్రెండింగ్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!