Imran Khan : 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది.
ఇమ్రాన్ ఖాన్ భార్య బుష్రా బీబీకి హైకోర్టు నుంచి ఊరట లభించింది. సబ్ జైలు నుండి అడియాలా జైలుకు తరలించాలని కోర్టు ఆదేశించింది. రెండు కేసుల్లో దోషిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను రావల్పిండిలోని హై సెక్యూరిటీ అడియాలా జైలులో ఉన్నారు. కాగా.. బుష్రా బీబీని ఇస్లామాబాద్ శివారులోని ఇమ్రాన్ ఖాన్ నివాసం బనిగాలాలో ఖైదుగా ఉన్నారు. ఈ క్రమంలో అక్కడి నుంచి అడియాలా జైలుకు తరలించారు.
పాకిస్థాన్ టెహ్రీక్ ఈ ఇన్సాఫ్ వ్యవస్థాప అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలు అధికారులు, సిబ్బందిపై సంచలన ఆరోపణలను చేశారు. తన భార్య బుష్రా బీబీకి జైలులో టాయ్ లెట్ క్లీనర్ కలిపిన విషా ఆహారాన్ని ఇచ్చేవారిని పేర్కొన్నారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సోమవారం బిగ్ రిలీఫ్ లభించింది. ప్రభుత్వ ఖజానా (తోషాఖానా) అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీకి విధించిన శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో ఇద్దరికీ 14 ఏళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే..
ఇస్లామాబాద్‌లోని సెషన్స్ కోర్టు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, ఆయన భార్య బుష్రా బీబీల అక్రమ వివాహంపై కేసును కోర్టులో విచారణకు అర్హమైనదిగా పేర్కొంది. జూలై 20న వారిద్దరు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీల వివాహ వేడుకను ఇస్లామిక్ షరియా చట్టం ప్రకారం నిర్వహించలేదని పాక్ మతపెద్ద ముఫ్తీ మహ్మద్ సయీద్ అన్నారు. 2018లో ఈ జంట ఇస్లామిక్ వివాహం జరిపించిన మతగురువులు, ఇది బుష్రా బీబీ ఇద్దత్ కాలంలో జరిగిందని చెప్పారు.