స్టార్ హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో అద్భుత నటుడుగా మంచి గుర్తింపు సంపాదించారు.కథ నచ్చితే ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా వున్నారు. అయితే తాజాగా రానా హిరణ్యకశ్యప అనే సినిమాను ప్రకటించాడు. కామిక్ కాన్ వేదిక పై హిరణ్య కశ్యప్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేశారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి కథ అందించబోతున్నట్లు తెలుస్తుంది. హిరణ్యకశ్యపుడి పౌరాణిక గాధని ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా చూపించబోతున్నారని సమాచారం.. అయితే తాజాగా ఈ చిత్ర కాన్సెప్ట్ టీజర్ ని రానా విడుదల చేశారు.హిరణ్య కశ్యపుడి కార్టూన్ చిత్రాల రూపంలో ఉన్న వీడియో ను షేర్ చేశారు. ఈ వీడియోలో అనేక అంశాలు దాగి ఉన్నాయి. హిరణ్యకశ్యపుడిగా రానా లుక్ ఎంతో క్రూరంగా ఉండబోతుందని ఈ కాన్సెప్ట్ టీజర్ తో తెలియజేశారు.
Kaavaali: రచ్చ రేపిన ‘కావాలయ్యా’ తెలుగు వర్షన్ వచ్చేసింది.. విన్నారా?
అసలు హిరణ్య కశ్యపుడు కఠోరమైన తపస్సు ఎందుకు చేశాడు అనే అంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తుంది..ఈ కాన్సెప్ట్ టీజర్ లో ‘కాబట్టే అతడు కఠోరమైన తపస్సు మొదలు పెట్టాడు’ అనే లైన్ ఉన్న కార్టూన్ పిక్చర్ కూడా ఉంది. ఈ కాన్సెప్ట్ టీజర్ కి రానా ‘ రాక్షస రాజు ఆగమనం’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. త్వరలో మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నట్లు రానా ప్రకటించారు. హిరణ్య కశ్యపుడి వంటి రాక్షస రాజు లుక్ కోసం రానా ఎంతగానో ప్రయత్నిస్తున్నాడని సమాచారం.ఈ చిత్రానికి త్రివిక్రమ్ రచన అందిస్తున్నారు.అయితే ఈ చిత్రాని కి దర్శకుడు ఎవరు అనే విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు.. ఈ చిత్రాన్ని రానా ప్రకటించిన వేంటనే దర్శకుడు గుణశేఖర్ స్పందించారు హిరణ్యకశ్యప చిత్రం కోసం నేను దాదాపు ఐదేళ్ల పాటు కష్టపడ్డాను.నేను రూపొందించిన కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తే కనుక చూస్తూ ఊరుకునేది లేదు అంటూ హెచ్చరించారు. మరీ ఈ చిత్రం కథ ఎలా ఉండబోతుందో తెలియాల్సి ఉంది.