Kaavaali Telugu Version Lyrical Song From Jailer out now: సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘జైలర్’ రిలీజ్ కి రెడీ అవుతోంది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ జైలర్ సినిమా ఫస్ట్ సింగిల్ ‘కావాలయ్యా’ పాట తమిళ్ వెర్షన్ లో విడుదలై నేషనల్ వైడ్ గా వైరల్ అయి అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో వుంది. అయితే తాజాగా ఈ సాంగ్ తెలుగు వెర్షన్ ని బాహుబలి స్టార్ రానా చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. అనిరుధ్ ఈ పాటని క్యాచి బీట్స్ తో కంపోజ్ చేశారు.
Mehreen Pirzadaa: ఉర్ఫీ జావేద్‌లా తయారైన మెహ్రీన్.. ఇదేం డ్రెస్సురా బాబూ?
శ్రీ సాయి కిరణ్ సాహిత్యం అందించిన ఈ పాటను సింధూజ శ్రీనివాసన్, అనిరుధ్ కలసి హైలీ ఎనర్జిటిక్ గా పాడగా సూపర్ స్టార్ రజనీకాంత్ స్టైల్ మెస్మరైజ్ చేయగా, తమన్నా డ్యాన్స్ మూమెంట్స్ అలరింస్తున్నాయి. ఇక రజనీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్‌కుమార్, రమ్య కృష్ణన్ తో పాటు వసంత్ రవి, నాగ బాబు, యోగి బాబు, జాఫర్ సాదిక్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించనున్నారు. టాప్ టెక్నీషియన్స్ అయిన విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరామెన్ గా పనిచేస్తుండగా ఆర్ నిర్మల్ ఎడిటర్ గా చేస్తున్నారు. డిఆర్కే కిరణ్ ఆర్ట్ డైరెక్టర్ గా స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ జైలర్ సినిమా ఆగస్టు 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.