Anushka Shetty Birthday: బర్త్‌డే గిఫ్ట్‌గా.. ఆ బ్లాక్ బస్టర్ మూవీ పార్ట్-2 ప్రకటన రానుందా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Will Anushka Shetty’s Bhaagamathie Part 2 Announced: ‘అనుష్క శెట్టి’.. ఈ పేరును తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నాగార్జున ప్రధాన పాత్రలలో వచ్చిన `సూపర్` సినిమాతో అనుష్క వెండి తెరకు పరిచయం అయ్యారు. సూపర్ సినిమాలో సాషా క్యారక్టర్‌తో అందరిని ఆకర్షించారు. ఆపై రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. విక్రమార్కుడు సినిమా తరువాత అనుష్క కెరీర్ పూర్తిగా మారిపోయింది. ఓవైపు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలతో ప్రేక్షకుల మనసు దోచుకున్నారు. అనుష్క 18 ఏళ్లుగా సినీ పరిశ్రమలో ‘రారాణి’గా వెలుగొందుతున్నారు.
చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో గ్లామర్ పాత్రలు చేసిన అనుష్క శెట్టి.. తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలతో తానేంటో నిరూపించుకున్నారు. ముఖ్యంగా ‘అరుంధతి’ సినిమా అనుష్క సినీ జీవితాన్ని మార్చేసింది. హారర్ మూవీలలో అరుంధతి ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిపోయింది. ఈ సినిమా తరువాత టాలీవుడ్‌లో లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేర్ అఫ్ అడ్రస్ అయ్యారు అనుష్క. అరుంధతి అనంతరం రుద్రమదేవి, భాగమతి, సైజ్ జీరో సినిమాలతో మరో మెట్టు ఎక్కారు. ఇందులో భాగమతి సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది.
Also Read
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
Also Read: Road Accident: రోడ్డు ప్రమాదాల నుంచి త్రుటిలో బయటపడ్డ ఇద్దరు మాజీ సీఎంలు!
నేడు అనుష్క శెట్టి పుట్టినరోజు. నేటి ఆమె 43వ వసంతంలోకి అడుగుపెట్టనున్నారు. అనుష్క బర్త్‌డే సందర్భంగా భాగమతి 2 గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. భాగమతి 2 గురించి అప్ డేట్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రకటన అధికారికంగా వస్తే.. అనుష్క కెరియర్‌లో 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. మొదటి పార్ట్‌లో పార్ట్-2 ఉంటుందని హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అశోక్ జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మురళీ శర్మ, ఉన్ని ముకుందన్, జయరామ్, ఆశా శరత్ కీలక పాత్రలు పోషించారు.
తాజావార్తలు
-
Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!