Vijayendra: కర్ణాటకలో ముస్లింలకు గృహ పథకాల కింద రిజర్వేషన్‌ను 10 శాతం నుంచి 15 శాతానికి పెంచే నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై విమర్శల మోత మోగుతోంది. నేడు ( జూన్ 20) కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బి.వై. విజయేంద్ర ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది పూర్తిగా మతపరమైన మెప్పింపు రాజకీయమేనని విమర్శించారు. సిద్ధరామయ్య అల్పసంఖ్యాకులను మెప్పించేందుకు ఎటువంటి స్థాయికైనా దిగజారగలరని నిరూపించుకున్నారు. ఇది వారి విధానానికి అద్దంపడుతోంది. బీజేపీ ఎప్పుడూ…
పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ దేశ ప్రగతి, ఉద్యోగాల గురించి మాట్లాడటం లేదని.. ముస్లిం రిజెర్వేషన్ ఎత్తేస్తామని చెబుతున్నారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. గతంలో అమిత్ షా మాట్లాడితేనే కోర్టులో కేసు వేశామని గుర్తుచేశారు.
ఒక సంచలనమైన తీర్పును కలకత్తా హైకోర్టు ఇచ్చిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ అన్నారు. ముస్లింలని ఓబీసీలలో చేర్చడాన్ని అక్కడి న్యాయస్థానం తప్పు పట్టిందన్నారు. 75 ముస్లిం కులాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఓబీసీలలో చేర్చింది.
ప్రశాంతంగా ఉన్న దేశంలో మతకల్లోలం సృష్టించడానికి బీజేపీ కుట్రలు చేస్తోందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా చేసిన కామెంట్స్ వల్ల మతకల్లోలానికి దారి తీసే అవకాశం ఉందన్నారు. కేంద్ర హోంమంత్రి వ్యాఖ్యలు బాధను కలిగించాయన్నారు.
Karnataka: కర్ణాటక ఎన్నికల ముందు అక్కడి అధికార బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లలో 4 శాతం ముస్లిం కోటా రిజర్వేషన్లను రద్దు చేసింది. మొత్తం రిజర్వేషన్లను 56 శాతానికి పెంచింది. ముస్లింలకు 4 శాతం ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ముస్లింలు 10 శాతం ఆర్థికంగా బలహీన విభాగం(ఈడబ్ల్యూఎస్) కేటగిరిలో రిజర్వేషన్ పొందే అవకాశం మాత్రమే ఉంటుంది. ముస్లింల 4 శాతం కోటాను ఇప్పుడు వొక్కలిగా, లింగాయత్ లకు ఇవ్వనున్నారు.