Tejashwi Yadav: ప్రశాంత్ కిషోర్‌కి బీజేపీ నిధులు.. ఎన్నికల వ్యూహమని తేజస్వీ ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. ఈసారి కూడా ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ, ఎన్డీయే కూటమి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. అయితే బీజేపీ చెబుతున్న ప్రకారం సొంతగా 370 సీట్లు, ఎన్డీయేకి 400+ సీట్లు మాత్రం వచ్చే అవకాశం లేదని చెప్పారు. 2019 ఫలితాలకు సమానంగా లేకపోతే కాస్త ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. అయితే, ఆయన అంచనాలపై ప్రతిపక్ష కాంగ్రెస్, ఇతర ఇండియా కూటమి పార్టీలు విరుచుకుపడుతున్నాయి. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఎజెంట్ అని విమర్శించడం మొదలుపెట్టాయి.
Read Also: US warning: వెనిజులా వెళ్లొద్దని పౌరులకు అమెరికా హెచ్చరిక
Also Read
- Gyanesh Kumar: ప్రతిపక్షాల విమర్శల మధ్య CEC జ్ఞానేష్ కుమార్.. ఆయన ఎవరు, నేపథ్యం ఏమిటి?
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Bihar: లైంగిక కేసు నిందితుడి చెంప పగలగొట్టిన న్యాయవాది
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
తాజాగా లాలూ పార్టీ ఆర్జేడీ నేత, బీహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ శుక్రవారం మాట్లాడుతూ.. ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని, బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని తెలిసే ఓ కథనాన్ని సెట్ చేయాడానికి ఆయన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అమిత్ షా కోరిక మేరకే ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిని చేశానని, నితీష్ కుమార్ కూడా చెప్పారని, ఇప్పటి వరకు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ కానీ ఈ వ్యాఖ్యలపై స్పందించలేదని, ఆయన బీజేపీతో ఉన్నారని అన్నారు.
ప్రశాంత్ కిషోర్ జీతాలు తీసుకునే జిల్లా అధ్యక్షులను పెట్టుకున్నాడని, ఇది బీజేపీకి కూడా లేదని, అతనికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదని, అతను ప్రతీ ఏడాది వేర్వేరు వ్యక్తులతో పనిచేస్తుంటారని, అతను మీ డేటాను తీసుకుని వస్తారు, అతను బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదని, బీజేపీ మైండ్ అని, వారి సిద్ధాంతాలను అనుసరిస్తారని బీజేపీ వ్యూహంలో భాగంగా అతనికి నిధులు వస్తున్నాయని తేజస్వీ యాదవ్ ఆరోపించారు. ఇటీవల బీజేపీ ప్రశాంత్ కిషోర్ని జాతీయ అధికార ప్రతినిధిగా నియమించుకుందనే ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయిన తర్వాత తేజస్వీ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాజావార్తలు
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
-
Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!