Actor Suman Says YS Jagan Will Become Chief Minister Again: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని.. జగన్‌మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి పదవి చేపడతారని సినీ నటుడు సుమన్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందజేయడమే అందుకు కారణమని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పుల్లేటికుర్రులో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు, తమ అభిమానులు తెలిపిన అభిప్రాయాల మేరకు మరోసారి వైసీపీనే అధికారంలోకి వస్తుందన్నారు. గత ప్రభుత్వాలు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోలేదని.. వైసీపీ ప్రభుత్వంలోనే సముచిత న్యాయం జరిగిందని ఆ వర్గాల వారు చెప్తున్నారని తెలిపారు. నవరత్న పథకాలను 95 శాతం అమలు చేసి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించిన సీఎం జగన్ దేశానికే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
Extramarital Affair: అత్తతో ఎఫైర్.. ఒరేయ్ ఫ్రెండ్‌గా, ఎంత పని చేశావ్‌రా?
గతంలోనూ సీఎం జగన్‌పై సుమన్ ప్రశంసల వర్షం కురిపించారు. ఇంతకుముందు జగన్ ముందస్తు బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నప్పుడు.. తండ్రికి తగ్గ తనయుడు అంటూ జగన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ చాలామంది సీఎంల పనితీరుని చూశానని.. కానీ సంక్షేమ పథకాలు అమలులో జగన్ తన తండ్రి వైఎస్‌ని మించిపోయారంటూ కొనియాడారు. చూస్తుంటే.. సుమన్ త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోవచ్చన్న ప్రచారాలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి.
Kishan Reddy: కేబినెట్ సమావేశానికి కిషన్ రెడ్డి డుమ్మా..! త్వరలో పదవికి రాజీనామా..?