ఇండియన్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేంజ్ ఇప్పుడు మారిందనే చెప్పాలి.. ట్రిపుల్ ఆర్ సినిమాతో ఆయన క్రేజ్ ఇంటర్నేషనల్ కు మారిపోయింది.. ఒకవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు కమర్షియల్ యాడ్స్ అంటూ దూసుకుపోతున్నారు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలామంది ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో బ్రాండ్ క్రియేట్ చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తుంటే ఈయన మాత్రం గ్లోబల్ స్టార్ గా ఎదిగిపోయారు. ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఇలా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు రామ్ చరణ్..
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా హీరోలు అందరు కూడా ఆ రేంజ్ లో యాడ్స్ చేస్తున్నారు..కమర్షియల్ బిజినెస్ కంపెనీలు కూడా తమ ప్రాజెక్టులను ప్రమోట్ చేసుకోవడానికి వారిని బ్రాండ్ అంబాసిడర్ గా ఉపయోగించుకోవడం జరుగుతుంది. అంతేకాదు కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చి మరి బ్రాండ్ ప్రమోషన్స్ కోసం అగ్రిమెంట్ చేసుకుంటున్నాయి బడా కంపెనీలు. ఈ క్రమంలోనే ఇప్పుడు కమర్షియల్ బ్రాండ్స్ ప్రమోషన్ చేస్తున్న స్టార్ట్స్ లో మహేష్ బాబు టాప్ లో ఉండగా.. ఆ తర్వాత అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు ఉన్నారు.. వీరితోనే ఎక్కువగా కంపెనీలు కూడా యాడ్స్ చేసేందుకు ముందుకు వస్తున్నాయి.. ఇక హీరోలు కూడా తమ రేంజు ను పెరుగుతుందని వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ కోట్లు సంపాదిస్తున్నారు..
ఇది ఇలా ఉండగా..రామ్ చరణ్ మరో జాక్పాట్ కొట్టాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఒక మొబైల్ షోరూం కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఈయన ఇప్పుడు మరో కొత్త బ్రాండ్ ప్రమోషన్ టేకప్ చేయడం జరిగింది. తక్కువ ధరలకే ఆన్లైన్లో కాస్ట్యూమ్స్ ని అందించే ప్రముఖ ఈ కామర్స్ యాప్ మీషో కి తాజాగా బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు రామ్ చరణ్. ఇంట్రెస్టింగ్ యాడ్ ని రిలీజ్ చేస్తూ సినిమాటిక్ స్టైల్లో ఆ యాడ్ ఉండడం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది..ప్రస్తుతం రామ్ చరణ్ కి సంబంధించి ప్రమోషన్స్ లో భాగంగా మీ షో ఆప్ విడుదల చేసిన యాడ్ చాలా వైరల్ గా మారుతుంది. కూతురు పుట్టిన తర్వాత చరణ్ కు అదృష్టం అలా కలిసి వస్తుంది..మరోవైపు వరుస సినిమాలు కూడా చేస్తున్నాడు..