Japan: చైనాకు చెక్ పెట్టిన ఇండియా ఫ్రెండ్.. డ్రాగన్ ఆట ముగిసినట్లే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japan: ప్రపంచ సాంకేతికత, ఆధునిక యుద్ధానికి పునాది అయిన అరుదైన భూమి లోహాలపై చైనా గుత్తాధిపత్యం కలిగి ఉంది. 2025లో చైనా విధించిన ఆంక్షల తరువాత ఇండియా స్నేహితుడు అయిన జపాన్ బీజింగ్‌కు చెక్ పెట్టింది. వాస్తవానికి ప్రపంచం ఇప్పటివరకు చైనాపై ఆధారపడిన విలువైన ఖనిజాలను వెలికితీసేందుకు జపాన్‌కు చెందిన ఒక భారీ నౌక బయలుదేరింది. దీంతో ఈ ఆటలో ఇకపై చైనా ఆట ముగిసినట్లే అని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
- Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
- PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
రాయిటర్స్ నివేదికల ప్రకారం.. జపాన్ యొక్క పరీక్షా నౌక చిక్యూ, టోక్యో నుంచి దాదాపు 1,900 కిలోమీటర్ల దూరంలో ఉన్న మినామిటోరి ద్వీపం వైపు వెళుతోంది. ఈ ఓడ యొక్క లక్ష్యం చాలా సంక్లిష్టమైనది. ఎందుకంటే ఇది మినామిటోరి ద్వీపం ప్రాంతంలోని సముద్ర ఉపరితలం నుంచి 6 కిలోమీటర్లు (4 మైళ్ళు) దిగువన డైవ్ చేయబోతుంది. ఈ సముద్రపు అడుగున ఉన్న బురదలో అరుదైన రేర్‌ఎర్త్ ఖనిజాల అపార నిల్వలు ఉన్నాయని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు. ఇంత లోతు నుంచి నిరంతరం బురదను వెలికితీసి విశ్లేషించడం ప్రపంచంలో ఇదే మొదటిసారి అవుతుందని చెబుతున్నారు. 130 మంది సిబ్బంది, పరిశోధకుల బృందంతో కూడిన ఈ నౌక ఈ మిషన్‌ను పూర్తి చేసి ఫిబ్రవరి 14 నాటికి తిరిగి వస్తుందని సమాచారం.
ఈ రోజు మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌లు, ఎలక్ట్రిక్ కార్లు, జాతీయ భద్రత కోసం మోహరించిన క్షిపణి వ్యవస్థల సృష్టిలో అరుదైన ఈ రేర్‌ఎర్త్ ఖనిజాల కీలక పాత్ర పోషిస్తాయి. ఇప్పటివరకు జపాన్, పాశ్చాత్య దేశాలు ఈ ఖనిజాల కోసం చైనాపై ఆధారపడ్డాయి. అయితే బీజింగ్‌తో కొనసాగుతున్న దౌత్య వివాదాల మధ్య, చైనా ఈ ముఖ్యమైన ఖనిజాల ఎగుమతిపై అనేక ఆంక్షలు విధించింది. చైనా నుంచి ఈ “బ్లాక్‌మెయిలింగ్”ను నివారించడానికి, జపాన్ ఇప్పుడు సరికొత్త అన్వేషణ వైపు అడుగులు వేస్తోంది. ఈ మిషన్ విజయవంతమైతే సాంకేతిక రంగంలో సరఫరాలపై చైనా ఆధిపత్యం అంతం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
పలు నివేదికల ప్రకారం.. జపాన్ ప్రభుత్వం గత ఏడు సంవత్సరాలుగా దీని కోసం సన్నాహాలు చేస్తోంది. ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు అధిపతి షోయిచి ఇషి ఓడ ప్రారంభం అయినప్పుడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. సముద్ర మట్టానికి 6 కిలోమీటర్ల దిగువన వనరులను వెలికితీయడం ఒక పెద్ద సాంకేతిక విజయం అని షోయిచి ఇషి చెప్పారు. ఈ విజయం జపాన్ వనరుల సేకరణ పద్ధతులను పూర్తిగా మారుస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
READ ALSO: Sreeleela: ‘శ్రీలీల’ నీకే ఎందుకు ఇలా..
తాజావార్తలు
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
-
Eatala Rajendar: జ్ఞానేష్ కుమార్ ఎందుకు రాజీనామా చెయ్యాలి?
-
Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
-
PCB: షోయబ్ అక్తర్‌కు పీసీబీలో కీలక పోస్టు..! చైర్మన్ నఖ్వీతో భేటీ
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!