NTV Telugu Site icon

ICC T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు ప్రకటన.. కింగ్ లేకండానే టీమిండియా నుండి ఆరుగురుకు చోటు..

Icc2024

Icc2024

ICC T20 World Cup 2024 Team: తాజాగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2024 జుట్టును తాజాగా వెలువడించింది. ఇందులో టీమిండియా నుంచి ఏకంగా 6 మంది జట్టులో స్థానాన్ని సంపాదించారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఆల్ రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తోపాటు సూర్య కుమార్ యాదవ్, జస్ప్రీత్‌ బుమ్రా, అర్ష్‌దీప్‌ సింగ్‌ లకు స్థానం దక్కింది. అయితే సీరిస్ మొత్తం విఫలమై కేవలం ఫైనల్ మ్యాచ్లో తన బ్యాటింగ్ పవర్ ను చూపించిన విరాట్ కోహ్లీకి మాత్రం ఈసారి చోటు దక్కలేదు. దీంతో టీమిండియా అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు. ఇక ఈ లిస్ట్ గురించి పూర్తి వివరాలు చూస్తే..

Husband And Wife Case: తప్పుడు ఆరోపణలు చేసిన భార్యపై.. హైకోర్టు సంచలన తీర్పు..

ఐసీసీ జట్టులో టీమిండియా క్రికెటర్లతోపాటు వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా జట్లకు సంబంధించిన ఆటగాళ్లకు కూడా స్థానం లభించింది. ఈ లిస్టులో టీమిండియా తర్వాత అత్యధికంగా ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లకు ఐసీసీ జట్టులో స్థానాలను ఇచ్చింది ఐసీసీ. ఆఫ్ఘనిస్తాన్ జట్టు నుండి రహ్మానుల్లా గుర్బాజ్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ, రషీద్‌ ఖాన్‌ లకు జట్టులో స్థానం ఇచ్చింది ఐసీసీ. వీరితోపాటు వెస్టిండీస్ నుంచి నికోలస్ పురన్, ఆస్ట్రేలియా నుండి స్టోయినిస్‌ లకు స్థానాలు దక్కాయి. ఇక 12వ ఆటగాడిగా దక్షిణాఫ్రికా బౌలర్ నోర్జే ఎంపికయ్యాడు.

Kalki 2898 AD : తగ్గుతున్న కల్కి టికెట్ ధరలు.. అప్పటినుండేనా..?

Show comments