Husband and Wife Case: ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి భార్య భర్తలు గొడవ పడుతున్న నేపథ్యంలో చాలామంది విడాకులు తీసుకున్నంత వరకు వెళ్తున్నారు. అలాంటి సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలో జరగగా.. అందుకు సంబంధించి భార్య పెట్టిన కేసు పై కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను చూస్తే.. కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి తన ఉద్యోగం రీత్యా అమెరికాలో నివాసం ఉంటున్నాడు. అయితే పెళ్లి జరిగిన కొద్ది కాలానికి హెచ్ వన్ బి వీసా గడువు ముగిసిపోవడంతో అతను తిరిగి అమెరికాకు వెళ్ళాడు. ఈ నేపథ్యంలో తన భార్యను కూడా అమెరికాకు తీసుకు వెళ్లడానికి అతడు చాలాసార్లు ప్రయత్నాలు చేశాడు. అయితే భర్త అన్ని సార్లు ఆమెను అమెరికాకు తీసుకవెళ్లడానికి ప్రయత్నించిన ఆమె మాత్రం అమెరికాకు రావడానికి ఆసక్తి చూపలేదు. దీంతో విసిగిపోయిన ఆ భర్త 2021 డిసెంబర్ 3న బెంగళూరు కుటుంబ న్యాయస్థానంలో విడాకుల కోసం దరఖాస్తు చేశారు.
Kalki 2898 AD : తగ్గుతున్న కల్కి టికెట్ ధరలు.. అప్పటినుండేనా..?
ఈ విషయాన్ని గమనించిన భార్య.. తన భర్త పై వరకట్నం వేధింపులు, అలాగే అతనికి లైంగిక లోపం ఉందంటూ ఆరోపణలు చేసి కేసులు పెట్టింది. దీంతో న్యాయస్థానం జస్టిస్ నాగ ప్రసన్న కేసు వివరాలను పూర్తిగా పరిశీలించి సంచలన తీర్పును ప్రకటించాడు. భర్త వరకట్నం వేధింపులు డిమాండ్ చేసినట్లు కానీ.. అలాగే క్రూరత్వం ప్రదర్శించినట్లుగాని ఎక్కడ తేలలేదని ఆయన గుర్తించాడు. దీంతో భార్యపై కేసు పెట్టేందుకు భర్తకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీంతో ఈ విషయం కాస్త వైరల్ గా మారింది.