Kalki 2898 AD : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్కి మ్యానియానే నడుస్తోంది. భారీ సంఖ్య థియేటర్లలో విడుదలైన ఈ పాన్ ఇండియా స్టార్ సినిమా తాజాగా 555 కోట్ల వసూళ్లను రాబట్టిన విషయం తెలిసిందే. ఈ వారాంతరానికి ఈ మార్క్ కాస్త వెయ్యి కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇకపోతే., బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ అభిమానులు బాగా మెచ్చిన సినిమా కల్కి. మధ్యలో వచ్చిన సినిమాలను ప్రేక్షకులు నుంచి ఆదరణ లభించిన పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఇప్పుడు ఈ కల్కి సినిమా ప్రపంచవ్యాప్తంగా విజువల్ ట్రీట్ తో అంచనాలకు మించి వసూలను రాబడుతుంది. ఇకపోతే ఇంత భారీ కలెక్షన్లు రావడానికి కారణం.. పెంచిన టికెట్లు కూడా అని చెప్పవచ్చు. వీటి వల్ల సామాన్యుడికి అందనంత రేంజ్ లో ఉన్నాయంటూ కూడా విమర్శలు వచ్చాయి. పెంచిన రేట్ల ప్రకారం సింగిల్ స్క్రీన్ లో 250 రూపాయలు, మల్టీప్లెక్స్ లో ఏకంగా 500 కు పైగా ఉంది. దీంతో చాలామంది ప్రేక్షకులు టికెట్ ధరలు తగ్గాక చూడాలని ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా ఇంత భారీ టికెట్ల ధరల నేపథ్యంలో ఫ్యామిలీ మొత్తం సినిమాకు వెళ్లాలంటే సామాన్యులు ధైర్యం చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే తాజాగా కల్కి టికెట్ రేట్ లపై సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Top Headlines @ 9 AM: టాప్ న్యూస్
ఈ విషయం సంబంధించిన సమాచారం మేరకు.. కల్కి సినిమా టికెట్ ధరలు తగ్గుతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరల కంటే నార్మల్ రేట్ కు రాబోతున్నట్లు సమాచారం. ఈ వారం వరకు సినిమాకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను బట్టి కల్కి టికెట్ ధరలను మల్టీప్లెక్స్ లో 235 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 150 రూపాయలు చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఏదైనా మాత్రం ఈ వారం గడిచిన తర్వాతే. కల్కి సినిమా మరిన్ని కలెక్షన్లు రావాలంటే మాత్రం అది ఫ్యామిలీ ఆడియన్స్ ద్వారానే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టికెట్ ధరలతో ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం థియేటర్లకు వచ్చి చూడాలంటే అది ఆలోచించేలా చేస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని త్వరగానే గ్రహించిన మూవీ మేకర్స్ అతి త్వరలో సినిమా టికెట్ ధరలను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇలా చేస్తే ఒకసారి చూసిన అభిమానులు కూడా మరోసారి థియేటర్ వైపు నడిచే అవకాశం కూడా లేకపోలేదు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై, నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి టాకును సంపాదించుకుంది.
Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఓపెన్ లూప్ టికెటింగ్..!