Bihar Politics: బిహార్ లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిహార్‌లో రాజకీయం రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో నితీశ్‌కుమార్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 100 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ పరిణామంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ మార్పు రాబోతోందని స్పష్టమైన సంకేతాలను ఇచ్చింది. ఇక, రాష్ట్రంలో మొత్తం 22 మంది ఐఏఎస్, 79 మంది ఐపీఎస్, 45 మంది గ్రూప్-1 స్థాయి అధికారులను నితీశ్ కుమార్ సర్కార్ ట్రాన్స్ ఫర్ చేసింది.
Read Also: Vidhi :ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లింగ్ మూవీ ‘విధి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
Also Read
- Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
- Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
- Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
- Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
ఇక, బదిలీ అయిన వారిలో అయిదుగురు జిల్లా కలెక్టర్లు ఉండగా 17 మంది జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీసులు(ఎస్పీ) ఉన్నారు. పాట్నా డీఎం చంద్రశేఖర్ సింగ్‌ను సీఎంవో స్పెషల్ సెక్రటరీగా నితీశ్ కుమార్ సర్కార్ నియమించింది. కాగా, జనతాదళ్ యునైటెడ్ చీఫ్, సీఎం నితీశ్‌కుమార్ ఆర్జేడీని వదిలి బీజేపీతో కలిసి కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నారని జోరుగా ప్రచారం కొనసాగుతుంది. నితీశ్ తన సీఎం పదవికి రాజీనామా చేసి బీజేపీతో జత కట్టి తిరిగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా ఉన్నతాధికారుల బదిలీలు జరగడంతో నితీశ్ కుమార్ ఇండియా కూటమి నుంచి ఏన్డీయే కూటమిలోకి వెళ్లేందుకు సంకేతాలుగా చెబుతున్నారు.
తాజావార్తలు
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
-
Telangana Public Schools : తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు డెడ్‌లైన్.. డిసెంబర్లోనే రెడీ.!
-
Dr. Himabindu Annamaraju : లక్షల్లో ఒక్కరికి వచ్చే రుగ్మత.. తల్లీబిడ్డకు సేఫ్ డెలివరీ..!
-
Chiranjeevi: మెగాస్టార్ మరో లీక్!.. ఈసారి #Mega158 టైటిల్
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..