Hyundai Creta Facelift 2024 spotted testing in India: కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ‘హ్యుందాయ్ క్రెటా’కు మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికీ క్రెటాకు మంచి అమ్మకాలు ఉన్నాయి. అయితే హ్యుందాయ్ క్రెటా దాని ప్రత్యర్థి ఎస్‌యూవీలు మరింత అధునాతనంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటితో పోటీపడేందుకు హ్యుందాయ్ కంపెనీ కూడా క్రెటాలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. వచ్చే ఏడాది 2024లో ఈ కారు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారు యొక్క కొన్ని ఫొటోస్ టెస్టింగ్ సమయంలో లీక్ అయ్యాయి. క్రెటా ఫేస్‌లిఫ్ట్ డిజైన్, ఫీచర్స్ లాంటి వివరాలు బయటికి వచ్చాయి.
కొత్త హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ 18-అంగుళాల అల్లాయ్ వీల్స్ (అల్కాజర్), గ్లోబల్-స్పెక్ పాలిసేడ్ ఎస్‌యూవీ నుంచి ప్రేరణ పొందిన రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్‌ను కలిగి ఉంది. నవీకరించబడిన ఎస్‌యూవీ మోడల్ నిలువుగా ఉండే హెడ్ ల్యాంప్‌లను కూడా కలిగి ఉంది. ఇది కూడా పాలిసేడ్ మాదిరే ఉన్నాయి. ఇది కొత్త ఎల్‌ఈడీ డీఆర్ఎల్‌లను కూడా కలిగి ఉంటుంది. చుడానికి ఇవి చాలా బాగుంటాయని సమాచారం.
Also Read: ODI Worldcup 2023: ప్రపంచకప్‌కు అర్హత సాధించలేకపోవడం సిగ్గుచేటు: సెహ్వాగ్
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ గురించి మరింత సమాచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. పలు నివేదికల ప్రకారం.. 2024 హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్.. హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) టెక్నాలజీతో వస్తుంది. దీని ఏడీఏఎస్‌లో లేన్-కీపింగ్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, స్టాప్ అండ్ గోతో అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఉన్నాయి. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ కొలిషన్ వార్నింగ్ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.
హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ నవీకరించబడిన బ్లూలింక్ కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీతో వస్తుంది. ఇందులో వెహికల్ ట్రాకింగ్, వెహికల్ ఇమ్మొబిలైజేషన్ మరియు వాలెట్ పార్కింగ్ మోడ్ వంటి ఫీచర్లు ఉంటాయి. దీనితో పాటు 360 డిగ్రీ కెమెరా కూడా ఉంటుంది. హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్ కూడా వెర్నా మాదిరి 1.5L టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. ఇది 160bhp మరియు 253Nm శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ప్రస్తుతం ఉన్న పవర్‌ట్రెయిన్ ఎంపికలు ఇందులో కొనసాగవచ్చు. ఈ కారు ధర, మైలేజ్ లాంటి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: Flight Ticket Offers: రూ.1499కే విమాన టిక్కెట్.. బంపర్ ఆఫర్ ఇంకా ఒక్క రోజు మాత్రమే!