Hydra Marshals Strike in Hyderabad After Salary Cut: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ (హైడ్రా)లోని మార్షల్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. జీతాలు తగ్గించడంతో మార్షల్స్ విధులను బహిష్కరించారు. విధుల బహిష్కరణతో మాన్సూన్ ఆపరేషన్‌పై ప్రభావం పడింది. హైడ్రా కంట్రోల్ రూమ్ సేవలకు అంతరాయం కలిగింది. ట్రైనింగ్ కార్యక్రమం, ప్రజావాణి సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. హైదరాబాద్ నగరంలోని ప్రభుత్వ స్థలాలు, చెరువుల పరిరక్షణకు హైడ్రా కృషి చేస్తున్న విషయం తెలిసిందే.
గత నెల 23న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఫిక్స్ చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ జీవో ఆధారంగా మార్షల్స్‌కి రూ.22,500 జీతం అధికారులు ఫిక్స్ చేశారు. అంతకుముందు ఎక్కువ జీతాలు ఇస్తూ.. ఇప్పుడు తగ్గించడంతో హైడ్రా మార్షల్స్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. జీతాలు తగ్గించడంతో హైడ్రాలోని మార్షల్స్ నేడు విధులను బహిష్కరించారు. గ్రేటర్ హైదరాబాద్‌లోని 150 డివిజన్లలో సేవలు బంద్ అయ్యాయి. 51 హైడ్రా భారీ వాహనాల సేవలు నిలిచిపోయాయి. హైడ్రాలో ఎమర్జెన్సీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. మాజీ సైనిక ఉద్యోగులు మార్షల్స్‌గా పనిచేస్తున్నారు.
Also Read: Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటిముందు నిరసన.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక!
మార్షల్స్‌లో చాలా మంది మాజీ సైనికులు ఉన్నారు. వీరందరూ హైదరాబాద్ నగరంలో చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను కాపాడటం, వర్షా కాలంలో వరదల సమస్యలను తగ్గించేందుకు పగలు రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తారు. ఇటీవల వేతనాలను తగ్గించడంతో విధులను బహిష్కరించారు. దాంతో మాన్సూన్ ఆపరేషన్స్ సహా అనేక సేవలపై ప్రభావం కనిపిస్తోంది.