Union Budget 2026: పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్.. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి ‘కొత్త ఐటీ చట్టం’!
- ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025 అమల్లోకి
- పన్ను ప్రక్రియను మరింత సరళతరం చేయడమే లక్ష్యం
- విద్య, వైద్యం, విదేశీ టూర్ ప్యాకేజీలపై TCS 5% నుంచి 2%కి తగ్గింపు
- సవరించిన రిటర్నుల గడువు డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగింపు
- చిన్న పన్ను చెల్లింపుదారులకు 6 నెలల ప్రత్యేక ఊరట పథకం
- రహదారి ప్రమాద పరిహారంపై వడ్డీకి పన్ను మినహాయింపు
- సామాన్యులు సొంతంగా ఫైల్ చేసేలా సులభమైన ITR ఫారాలు
- ITR-1, ITR-2 ఫారాలు జూలై 31 వరకు అందుబాటులో
- మాన్‌పవర్ సరఫరా సంస్థలపై TDS 1–2%కి పరిమితం
- విదేశీ ఆస్తులు వెల్లడించేందుకు వన్ టైమ్ స్కీమ్ జరిమానా లేకుండా అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Union Budget 2026: మధ్యతరగతి ప్రజలకు, చిన్న తరహా పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2026లో కీలక ప్రకటనలు చేశారు. దశాబ్దాల కాలం నాటి పన్ను నిబంధనలను పక్కన పెట్టి సామాన్యులకు సైతం అర్థమయ్యేలా ‘కొత్త ఆదాయపు పన్ను చట్టం – 2025’ను ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు.
Ram Charan: ‘ఇంత ఆనందంలో మాటలు రావడం లేదు’.. రామ్ చరణ్ భావోద్వేగం!
Also Read
కొత్త చట్టం ద్వారా పన్ను ప్రక్రియను మరింత సరళతరం చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఇందులో భాగంగా ప్రధానంగా ప్రకటించిన అంశాల విషయానికి వస్తే.. విద్య, వైద్య సేవలపై అలాగే విదేశీ టూర్ ప్యాకేజీలపై ఉన్న TCS (Tax Collected at Source) ను 5% నుంచి 2 శాతానికి తగ్గించారు. ఇది విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు, చికిత్స పొందే వారికి పెద్ద ఊరట కానుంది.
అలాగే సవరించిన పన్ను రిటర్నుల (Revised Returns) దాఖలు గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు. ఇంకా చిన్న తరహా ఆదాయపన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేకంగా 6 నెలల పాటు ఊరటనిచ్చే పథకాన్ని కూడా ప్రకటించారు మంత్రి. ముఖ్యంగా రహదారి ప్రమాదాల వల్ల వచ్చే పరిహారంపై వడ్డీకి పన్ను మినహాయింపు ఇచ్చారు.
Sreeleela :పెళ్ళాన్ని అడిగినట్టు అడిగారు!.. అబ్బాయిల డిమాండ్‌పై శ్రీలీల క్రేజీ పంచ్!
ఇవి ఇలా ఉండగా.. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయడం ఇకపై మరింత సులభం కానుంది. సామాన్యులు కూడా సొంతంగా ఫైల్ చేసేలా సరళతరమైన ఫారాలను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు. ఇందులో భాగంగా ITR-1, ITR-2 ఫారాలు జులై 31 వరకు అందుబాటులో ఉంటాయని అన్నారు. ఇంకామ్యాన్ పవర్ సరఫరా చేసే సంస్థలపై TDSను 1 లేదా 2 శాతానికి పరిమితం చేశారు మంత్రి.
విదేశాల్లో ఆస్తులు కలిగి ఉండి, వాటిని వెల్లడించని వారి కోసం ప్రభుత్వం ‘వన్ టైమ్ స్కీమ్’ను ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఎటువంటి జరిమానాలు లేకుండా విదేశీ ఆస్తులను వెల్లడించే అవకాశం కల్పించింది కేంద్రం.
తాజావార్తలు
-
OTR : నెల్లిమర్ల నగర పంచాయతీలో ఛైర్మన్ సీటు పంచాయితీ
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?