Konda Surekha: మంత్రి కొండా సురేఖ ఇంటిముందు నిరసన.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక!
- మంత్రి కొండా సురేఖ ఇంటిముందు నిరసన
- అక్షయపాత్రకి ఇవ్వొద్దంటూ సీఐటీయూ కార్యకర్తల నిరసన
- ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CITU Workers Protest Outside Minister Konda Surekha’s House: హనుమకొండ రాంనగర్‌లోని మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మధ్యాహ్న భోజన పథకం అక్షయపాత్రకి ఇవ్వొద్దంటూ మంత్రి ఇంటి ముందు సీఐటీయూ కార్యకర్తలు నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అక్షయపాత్రకు కేటాయించే ప్రతిపాదనలను విరమించుకోవాలంటూ నినాదాలు చేశారు. మధ్యాహ్న భోజన పథకంపై ఆధారపడి జీవన సాగిస్తున్న వారికి నష్టం చేసే తీరును విరమించుకోకపోతే.. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని సీఐటీయూ కార్యకర్తలు హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Viral Video: హృదయ విదారక ఘటన.. బైక్‌పై భార్య మృతదేహం తరలింపు, నిస్సహాయంగా భర్త!
Also Read
- Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Hyderabad: హనీట్రాప్ సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగి నుంచి రూ.38 లక్షలు వసూలు.!
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
అక్షయపాత్ర ఫౌండేషన్ అనేది భారతదేశంలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసే ఒక స్వచ్ఛంద సంస్థ. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పోషకాహారం అందిస్తుంది. అక్షయపాత్ర 2000 సంవత్సరంలో బెంగళూరులో ఐదు పాఠశాలల్లో 1,500 మంది పిల్లలతో ప్రారంభమైంది. ప్రస్తుతం దాదాపు 17 వేల పాఠశాలల్లో 2 మిలియన్లకు పైగా పిల్లలకు భోజనం అందిస్తుంది. మధ్యాహ్న భోజన పథకాన్ని హనుమకొండ జిల్లాలో అక్షయపాత్రకు ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ గతంలోనే డిమాండ్ చేశారు.
తాజాగా సీఐటీయూ కార్యకర్తలు మంత్రి కొండా సురేఖ ఇంటి ముందు నిరసన చేపట్టారు. 20 సంవత్సరాలకు పైగా మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకి భోజనం వండి పెడుతున్నారని, వారికి అన్యాయం చేయొద్దని కోరుతున్నారు. అధికారులు కార్మికుల పొట్ట కొట్టే నిర్ణయాలు తీసుకోవడం సరికాదంటున్నారు. 8 నెలల పెండింగ్ బిల్లులు వెంటనే ఇవ్వాలని, కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. మంత్రి కొండా సురేఖ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా.. సుబేదారి పోలీసులు సీఐటీయూ కార్యకర్తలను అడ్డుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రస్తుతం మంత్రి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తాజావార్తలు
-
Naga Vamsi: “నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు” సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
-
Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
-
Sivakarthikeyan: దళపతి బాటలోనే శివకార్తికేయన్? హీరోల ‘ఫ్యాన్స్ మీట్’ల వెనుక అసలు ప్లాన్ అదేనా!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?