MLA Quota MLC Elections 2025: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఉపాధ్యాయ, పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి.. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పేరాబత్తుల రాజశేఖరం, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల స్థానంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్, ఉత్తరాంధ్ర టీచర్ స్థానంలో గాదె శ్రీనివాసులు విజయం సాధించారు.. ఇక, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది.. దీంతో, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలుగుదేశం పార్టీ.. ఇప్పటికే జనసేన పార్టీ నుంచి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరును ఖరారు చేశారు.. అయితే, బీజేపీకి ఈ సారి డౌటే అనే చర్చ సాగుతోంది.. మిగిలిన నాలుగు స్థానాల్లో.. టీడీపీ నుంచి ఇద్దరు బీసీ, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారని తెలుస్తోంది..
Read Also: SLBC Tunnel Accident: మృతదేహాలను గుర్తించేందుకు కేరళ నుంచి క్యాడవర్ డాగ్స్..
అయితే, మొన్నటి ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయని స్థానాల్లో ఉన్న బీసీ నేతలపై పార్టీ అధిష్టానం దృష్టిసారించినట్టుగా చెబుతున్నారు.. ఇప్పటికే టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మంత్రి నారా లోకేష్ ను కలిశారు ఆశావహులు.. మరోవైపు, ఇప్పటికే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పి కొందరు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు.. ఇప్పుడు ఎవరిని మండలికి పంపించాలనేదానిపై టీడీపీ అధిష్టానం కసరత్తు చేస్తోంది.. మొత్తంగా ఈ నెల 8వ తేదీన అధికారికంగా టీడీపీ నుంచి అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా సమాచారం.