Pemmasani Chandrasekhar : కేంద్ర ఐటీ, టెలికమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు ముఖ్య విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ సైబర్ మోసాల నుంచి రక్షణ పొందేందుకు ‘సంచార్ సాథీ’ యాప్‌ను తప్పనిసరిగా వినియోగించాలని ఆయన సూచించారు. టెలికాం మంత్రిత్వ శాఖ, డిజిటల్ ఇంటెలిజెన్స్ అధికారులతో కలిసి ఈ యాప్‌ను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశామని తెలిపారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం.. గత ఏడాది నుంచి దేశవ్యాప్తంగా 50 లక్షల మంది సైబర్ ఫ్రాడ్‌లకు…
ఢిల్లీ- దేశంలో ఏ మూలన సైబర్ క్రైం జరిగినా ఇట్టే పట్టేసేంత టెక్నాలజీ, సైబర్ క్రైంను ఎదుర్కొనేందుకు అన్ని రాష్ట్రాల మధ్య సమన్వయం, సైబర్ నేరస్థులను నిలవరించేందుక భారీ వ్యూహంతో రంగంలోకి దిగింది కేంద్ర హోంశాఖ, భారతదేశంలో సైబర్ నేరాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. NCRB రికార్డ్స్ ప్రకారం ప్రతి గంటకు 8 మంది సైబర్ నేరస్థులకు బలైతున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సైబర్ నేరాలు గణనీయంగా పెరిగిపోవడంతో పెద్ద ఎత్తున ఆర్ధిక…
Find My Divice : ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ కీలక పాత్ర పోషిస్తోంది. కమ్యూనికేషన్ మొదలుకొని డేటా స్టోరేజ్, బ్యాంకింగ్, ఆన్‌లైన్ లావాదేవీలు ఇలా అన్నింటికీ మొబైల్ ఆధారంగా ఉంటుంది. అయితే ఈ అవసరాల మధ్య, ఫోన్ పోగొట్టుకోవడం లేదా దొంగతనానికి గురవడం అనేది పెద్ద సమస్యగా మారుతోంది. CEIR నివేదికలో నిజాలు బయటకు ప్రతి నెలా దేశవ్యాప్తంగా 50వేల కంటే ఎక్కువ మొబైల్ ఫోన్లు దొంగిలించబడుతున్నాయో లేక పోగొట్టుకున్నాయో CEIR (Central…
Digital Fruad : డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో భారతదేశంలో ఆన్‌లైన్ లావాదేవీలు అమితంగా పెరిగాయి. అయితే, ఈ వృద్ధికి అనుపాతంగా డిజిటల్ మోసాలు కూడా పెరుగుతుండటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. తాజాగా, డిజిటల్ పేమెంట్‌కు సంబంధించి మోసాలను అరికట్టేందుకు ‘డిజిటల్ పేమెంట్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్ (DPIP)’ అనే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ డీపీఐపీ ప్లాట్‌ఫామ్‌ను ప్రభుత్వ రంగ , ప్రైవేట్ రంగ…
Atchutapuram: విశాఖ జిల్లా అచ్యుతాపురంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భారీ సైబర్ డెన్ ను గుర్తించారు పోలీసులు. దీనితో ఆ ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఈశాన్య రాష్ట్రాల నుంచి యువతి, యువకులను తీసుకువచ్చి సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని పరవాడ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విజయనగరం ఉగ్ర మూలాలతో ఇప్పటికే పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ సమయంలో భారీ సైబర్ డెన్…
Cyber Crime: సైబర్ నేరగాళ్ల నుంచి 5.80 లక్షల రూపాయలు రికవరీ చేయడంలో కామారెడ్డి పట్టణ పోలీసులు విజయవంతమయ్యారు. ఇటీవల కామారెడ్డికి చెందిన రాజేందర్‌కు ఓ అనామక నంబర్ నుంచి వీడియో కాల్ వచ్చింది. కాల్‌లో మాట్లాడిన వ్యక్తులు ముంబై పోలీసులమని పరిచయం చేసుకున్నారు. రాజేందర్‌పై మనీ లాండరింగ్ కేసు నమోదైందని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బులను తాము చెప్పిన ఖాతాకు వెంటనే బదిలీ చేయాలని, లేకపోతే అరెస్ట్ అవుతావని హెచ్చరించారు.…
సైబర్ నేరాలకు చెక్ పెట్టడానికి ఫ్రాడ్ డిటెక్షన్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో వాట్సాప్, ఈ-మెయిల్స్ ద్వారా జరిగే సైబర్ మోసాలను ఈ సెక్యూరిటీ సిస్టమ్ అడ్డుకోనుంది. దాంతో ఎయిర్‌టెల్ వినియోగదారులను సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఈ ఫీచర్ కాపాడనుంది.
FDI Cyber Lab: హైదరాబాద్ నగరంలో డిజిటల్ ఫోరెన్సిక్స్, డేటా రికవరీ రంగాల్లో కీలక ముందడుగుగా FDI ల్యాబ్స్ నాంపల్లిలో తన తొలి అత్యాధునిక సైబర్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. ఇండియన్ ఆఫీస్ ఆటోమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక విభాగంగా పని చేసే ఈ ల్యాబ్, డిజిటల్ భద్రతా అవసరాల పరిష్కారానికి కీలక కేంద్రంగా మారనుందని నిర్వాహకులు వెల్లడించారు. ఈ ఆధునిక సైబర్ ల్యాబ్‌లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ.. వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వ విభాగాలకు డేటా…
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలు పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల రూపాయలు లోన్ యాప్ లో అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పురోగతి లభించింది. నరేంద్ర భార్య ఫొటోలను…
సైబర్ నేరగాళ్లకు టెక్నాలజీ వరంగా మారింది. రోజుకో ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను మోసం చేస్తూ అందినకాడికి దోచేస్తున్నారు. కాల్స్, మెసేజ్ లు, ఫేక్ లింక్స్ పంపిస్తూ వాటిని క్లిక్ చేయగానే ఖాతాలు లూటీ చేస్తున్నారు. సైబర్ మోసాలపై అవగాహన కల్పిస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. తాజాగా విద్యుత్ వినియోగదారులను ను టార్గెట్ చేశారు సైబర్ చీటర్స్. కరెంట్ బిల్ పెండింగ్ లో ఉందని.. బిల్ కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామని మెసేజ్ లు పంపిస్తూ మోసాలకు…