Hyderabad Metro Phase 2 : హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ లో ముందడుగు పడింది. వేగవంతంగా ఓల్డ్ సిటీ మెట్రో రైల్ భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. ఎంజీబీఎస్- చాంద్రాయణగుట్ట వరకు చేపడుతున్న 7.5కిలోమీటర్ల మెట్రోమార్గానికి కావాల్సిన ఆస్తుల సేకరణకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో.. ఈ రూట్‌లో రోడ్డు విస్తరణ, స్టేషన్ల నిర్మాణానికి ఆస్తుల సేకరణ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలోనే.. ఇప్పటికే ఇచ్చిన హైద్రాబాద్ మెట్రో రైలు అధికారులు భూసేకరణకు నోటీసులు ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మెట్రో ఫేస్ 2 కారిడార్ VI MGBS నుంచి చంద్రాయణగుట్ట వరకు 200 ఆస్తులుకు (100 LHS, 100 RHS) డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంది. ఈరోజు ఆస్తుల సేకరణ కు డిక్లరేషన్ కు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి ఆమోదం తెలిపారు. ఓల్డ్ సిటీ మెట్రో కారిడార్ కు రెండు వైపుల 100 చొప్పున 200 ఆస్తుల సేకరణకు ముందడుగు వేశారు అధికారులు. ఆస్తుల సేకరణ పూర్తి అయితే వాటికి అనుగుణంగా అవార్డు డిసెంబర్ నెల ఆఖరిలో ఆమోదించడం జరుగుతుందని, కొత్త సంవత్సరం జనవరి నెలలో మెట్రో రైలు పనులు ప్రారంభమవుతాయని కలెక్టర్ తెలిపారు.
Rohit Sharma: కొడుకు పుట్టిన తర్వాత మొదటిసారి స్పందించిన హిట్ మ్యాన్..