Drug Racket Busted: హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా బట్టబయలు.. బెంగళూరు కేంద్రంగా డ్రగ్స్ సరఫరా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Drug Racket Busted: హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ రాకెట్ స్థావరాలపై పోలీసులు గట్టి దెబ్బకొట్టారు. రాజేంద్రనగర్, మియాపూర్ ప్రాంతాల్లో వేర్వేరు ఆపరేషన్లలో భారీగా ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేసుల్లోనూ బెంగళూరును అడ్డాగా చేసుకుని నగరానికి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
Ram Gopal Varma: జీసస్, అల్లా మధ్య ఫైట్.. ఎవరు గెలిస్తే ఆ మతంలోకి మారతా..
Also Read
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్‌లో కనిపించిన కీలక లోపాలు
- Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఏఐఏడీఎంకేకు షాక్.. విజయ్ పార్టీకి భారీ బూస్ట్..
- Nara Lokesh: ఇప్పుడు 'మావిగన్'.. రేపు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాద్ కలిపి ‘బెన్‌తాహై’ అంటారేమో..!
ఈ దాడుల్లో హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో సుమారు రూ.20 లక్షల విలువ చేసే 150 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒమన్, పాలస్తీనా దేశాలకు చెందిన ముగ్గురు విదేశీయులను అరెస్ట్ చేశారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు డ్రగ్స్ తరలిస్తూ.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బడా వ్యాపారులను టార్గెట్‌గా చేసుకుని సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెంగళూరును ప్రధాన కేంద్రంగా చేసుకుని ఈ ముఠా డ్రగ్స్ దందా నడుపుతున్నట్లు దర్యాప్తులో బయటపడింది. నిందితులపై NDPS చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
ఇక మియాపూర్ పరిధిలో కూడా డ్రగ్స్ కలకలం రేగింది. మాదాపూర్ స్పెషల్ ఆపరేషన్స్ టీం (SOT) బృందం బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్‌కు డ్రగ్ తరలిస్తుండగా ముగ్గురు యువకులను పట్టుకుంది. వారి వద్ద నుంచి 12.6 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకుంది. నిందితులు హైదరాబాద్‌కు చెందిన యువకులేనని, వారు కారులో బెంగళూరు వెళ్లి అక్కడ నైజీరియన్ల వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి నగరానికి తీసుకొస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసును మియాపూర్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేసి NDPS యాక్ట్ కింద దర్యాప్తు కొనసాగిస్తోంది.
తాజావార్తలు
-
Daycare Abuse: మీకు మనసెలా వచ్చిందమ్మా.. టాయిలెట్ జెట్‌తో నీళ్లు చల్లి, వాషింగ్ మెషీన్లో బంధించి చిన్నారిపై చిత్రహింసలు
-
Microsoft Layoffs: ఐటీ ఉద్యోగులకు మళ్లీ బ్యాడ్ న్యూస్.. మైక్రోసాఫ్ట్‌లో 5,000 మంది అవుట్! ఎవరెవరి ఉద్యోగాలు ఊడనున్నాయంటే?
-
OG 2: పవన్ కళ్యాణ్ కొత్త లుక్ వైరల్.. ‘ఓజీ 2’పై ఒక్క ఫోటోతోనే భారీ హైప్
-
UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
-
Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటాయి
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?