Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fluffy Omelette Recipe: ప్రతిరోజూ ఒకే విధమైన ఆమ్లెట్ తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి పిల్లలకు, కుటుంబ సభ్యులకు ఫ్లఫీ ఆమ్లెట్ చేసి చూడండి. బయట కేఫేల్లో లభించే సౌఫ్లే తరహా ఈ ఆమ్లెట్ చాలా మెత్తగా, స్పాంజీగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలు దీని టెక్స్చర్ను బాగా ఇష్టపడతారు. చాలా తక్కువ పదార్థాలతో, సులభమైన విధానంలో ఈ ఫ్లఫీ ఆమ్లెట్‌ను తయారు చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేస్తారో చూసేద్దామా..
కావలసిన పదార్థాలు:
* గుడ్లు – 3
* ఉప్పు – తగినంత
* కారం పొడి – ½ టీ స్పూన్ (లేదా రుచికి సరిపడా)
* బటర్ లేదా నూనె – 1 టీ స్పూన్
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
తయారీ విధానం:
* ముందుగా మూడు గుడ్లను పగలగొట్టి అందులోని ఎగ్ వైట్ (తెల్లసొన), ఎగ్ యోక్ (పచ్చసొన)ను వేరు చేసుకోవాలి. ఇందుకోసం స్టైనర్ లేదా గుడ్డు విడదీయడానికి ఉపయోగించే సాధనాన్ని ఉపయోగించవచ్చు.
* తర్వాత పచ్చసొనను ఒక గిన్నెలో వేసి ఫోర్క్ సహాయంతో బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక తెల్లసొనను మరో గిన్నెలో తీసుకుని విస్కర్ లేదా ఫోర్క్‌తో సుమారు 8 నుంచి 10 నిమిషాల పాటు బాగా బీట్ చేయాలి. తెల్లసొన ఫోమ్‌లా మారి గట్టిగా నిలిచే స్థితికి వచ్చినప్పుడు ఆపాలి. తెల్లసొనను ఎంత బాగా బీట్ చేస్తే ఆమ్లెట్ అంత మెత్తగా, ఫ్లఫీగా వస్తుంది.
* ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి కొద్దిగా బటర్ లేదా నూనె వేసుకోవాలి. ముందుగా బీట్ చేసిన పచ్చసొన మిశ్రమాన్ని పాన్‌లో పోసి సమానంగా పరచాలి. దానిపై కొద్దిగా ఉప్పు, కారం చల్లాలి.
* ఆ తర్వాత బీట్ చేసి సిద్ధం చేసుకున్న తెల్లసొన ఫోమ్‌ను పచ్చసొనపై నెమ్మదిగా వేసి మొత్తం పరచాలి. పైన మరోసారి చిటికెడు ఉప్పు, కొద్దిగా కారం చల్లి మూత పెట్టాలి. తక్కువ మంటపై రెండు నిమిషాల పాటు ఉడికించాలి.
* ఆమ్లెట్ ఒకవైపు ఉడికిన తర్వాత దానిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆ ప్లేట్‌పై పాన్‌ను బోర్లించి, ఆమ్లెట్‌ను నెమ్మదిగా తిరగేసి మళ్లీ పాన్‌లోకి వేసుకోవాలి. మరో రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఫ్లఫీ ఆమ్లెట్ సిద్ధమవుతుంది.
* వేడి వేడిగా టమాటో సాస్, మయోనైస్ లేదా మీకు ఇష్టమైన డిప్‌తో సర్వ్ చేస్తే మరింత రుచిగా ఉంటుంది. పిల్లల టిఫిన్ లేదా బ్రేక్‌ఫాస్ట్‌కు బెస్ట్ ఆప్షన్.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!