Drug Racket Busted: హైదరాబాద్ (పేట్‌బషీరాబాద్) నగరంలో నిర్మాణ రంగం, ఇంటీరియర్ డిజైనింగ్ పనుల కోసం రాజస్థాన్ నుండి వలస వచ్చిన కళాకారులే లక్ష్యంగా సాగుతున్న భారీ మాదకద్రవ్యాల దందాను సైబరాబాద్ పోలీసులు గుట్టురట్టు చేశారు. పాన్ మసాలాల్లో మత్తు మందులు కలుపుకుని సేవించడమే కాకుండా, వాటిని అక్రమంగా విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పేట్‌బషీరాబాద్ పోలీసులు మరియు ఈగల్ ఫోర్స్ (EAGLE Force) ఛేదించింది. పాన్ మసాలాలో కలుపుకుని.. పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్ మరియు…