UP Boy: వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్.. రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు!
- వారంలో 3 రోజులు ఎల్కేజీ, 3 రోజులు ఫస్ట్ క్లాస్
- రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్న ఆరేళ్ల బాలుడు
- బాలుడి మానసిక పరిస్థితిపై ప్రభావం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లో ఓ ఆరేళ్ల చిన్నారి పరిస్థితి ఇప్పుడు అందరినీ కలచివేస్తోంది. తల్లి క్యాన్సర్‌తో మృతి చెందడంతో కుటుంబంలో ఏర్పడిన విభేదాల కారణంగా.. ఆ బాలుడు రెండు కుటుంబాల మధ్య నలిగిపోతున్నాడు. కోర్టు ఆదేశాల మేరకు వారంలో కొన్ని రోజులు తండ్రి వద్ద, మిగతా రోజులు అమ్మమ్మ-తాతల వద్ద గడపాల్సి వస్తుండటంతో.. అతని చదువు కూడా తీవ్రంగా దెబ్బతింటోంది.
బాలుడి సంరక్షణ విషయంలో ఇరు కుటుంబాల మధ్య వివాదం నెలకొనడంతో కోర్టు మధ్యంతర ఏర్పాట్లు చేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం చిన్నారి వారంలో నాలుగు రోజులు తన అమ్మమ్మ, తాతల వద్ద ఉండగా.. మిగిలిన మూడు రోజులు తండ్రి వద్ద గడుపుతున్నాడు. దీంతో అతని జీవితం ప్రతి వారం రెండు ఇళ్ల మధ్యే సాగుతోంది. అయితే అసలు సమస్య చదువు విషయంలో తలెత్తింది. తండ్రి తన వద్ద ఉన్న ప్రాంతంలోని ఓ పాఠశాలలో బాలుడిని మొదటి తరగతిలో చేర్పించాడు. మరోవైపు అమ్మమ్మ, తాతలు తమ ప్రాంతంలోని మరో పాఠశాలలో ఎల్కేజీలో అడ్మిషన్ కల్పించారు. ఫలితంగా ఆ చిన్నారి వారంలో మూడు రోజులు ఒక స్కూల్లో ఎల్కేజీ తరగతులకు హాజరవుతుండగా.. మరో మూడు రోజులు మరో స్కూల్లో మొదటి తరగతి చదవాల్సిన విచిత్ర పరిస్థితి ఏర్పడింది.
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
ఇరు ఇళ్ల మధ్య దాదాపు 25 కిలోమీటర్ల దూరం ఉండటంతో ప్రయాణం కూడా బాలుడికి అదనపు భారంగా మారింది. ఒకే సమయంలో రెండు వేర్వేరు సిలబస్‌లు, రెండు పాఠశాలల వాతావరణానికి అలవాటు పడాల్సి రావడంతో అతని మానసిక పరిస్థితిపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్లి మరణం తర్వాత ప్రేమ, ఆప్యాయతతో ఎదగాల్సిన వయసులో ఈ చిన్నారి రెండు కుటుంబాల మధ్య జీవితం గడపాల్సి రావడం హృదయవిదారకంగా మారింది. బాలుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇరు కుటుంబాలు పరస్పర అవగాహనతో వ్యవహరించాలని, అతని విద్యకు ఆటంకం కలగకుండా శాశ్వత పరిష్కారం కనుగొనాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. చిన్నారి శ్రేయస్సే ప్రధానంగా భావించి, అతని విద్య, మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సంబంధిత అధికారులు, కుటుంబ సభ్యులు తగిన నిర్ణయం తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!