పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో తెరకెక్కిన ఎపిక్ హిస్టారికల్ చిత్రం ‘బాహుబలి’ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారత సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాసిన ఈ బ్లాక్‌బస్టర్ ఇప్పుడు మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. రెండు పార్ట్‌లను కలిపి “బాహుబలి: ది ఎపిక్” పేరుతో రీ రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ప్రత్యేకంగా యూఎస్ మార్కెట్ సహా పాన్ ఇండియా రేంజ్‌లో బుక్ మై షో బుకింగ్స్ ఊహించని స్థాయిలో జరుగుతున్నాయి.
Also Read : Karuppu : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న కోలీవుడ్ స్టార్..!
ఇప్పటికే ప్రీ సేల్స్‌లోనే బాహుబలి ది ఎపిక్ 3 లక్షలకుపైగా టికెట్లు అమ్ముడయ్యాయని సమాచారం. కేవలం అక్టోబర్ 30 ఒక్కరోజే లక్ష టికెట్లు సేల్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రీ రిలీజ్ సినిమాకి ఇంత భారీ డిమాండ్ రావడం అరుదు. ప్రభాస్, రాజమౌళి పేరుతో ఆ ఉత్సాహం మళ్లీ జ్వాలగా మారింది. నేడు ఫుల్ ఫ్లెడ్జ్ రిలీజ్ ప్రారంభమవుతుండగా, మల్టీప్లెక్స్‌లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లన్నీ హౌస్‌ఫుల్ బోర్డులతో మెరిసిపోతున్నాయి. ప్రతి షో కూడా రికార్డు స్థాయిలో బుకింగ్స్ సాధిస్తోంది. సోషల్ మీడియాలో అభిమానులు పాత జ్ఞాపకాలను రీకాల్ చేసుకుంటూ బాహుబలి సునామీని మరోసారి ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ఫైనల్ రన్‌పై ఉంది. రీ రిలీజ్‌లో కూడా బాహుబలి కొత్త రికార్డులు సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.