తక్కువ ధరకే ప్లాట్లు ఇస్తామంటూ అమాయక ప్రజలను బురిడీ కొట్టించిన సాహితీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కేసులో సిసిఎస్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ స్కామ్ విలువ ఏకంగా రూ. 3,000 కోట్లు ఉంటుందని పోలీసులు నిర్ధారించారు. ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత పోలీసులు కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయడం గమనార్హం. సాహితీ ఇన్‌ఫ్రా అధినేత లక్ష్మీనారాయణ ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో భారీగా నిధులు వసూలు చేశారు. తక్కువ ధరకే ప్లాట్లు…
సాహితీ ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.200 కోట్ల ఆస్తులను సీజ్ చేశారు సీసీఎస్ పోలీసులు. సాహితీ పార్టనర్స్‌తో పాటు సంస్థ ఉద్యోగులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ స్కాంతో సంబంధం ఉన్న, రాజకీయ నాయకులకు, బడా వ్యాపారులకు ఉచ్చు బిగుస్తోంది.
ప్రీ లాంచింగ్ పేరుతో రియల్ ఎస్టేట్ సంస్థ సాహితీ ఇన్‌ఫ్రా చేసిన వసూళ్ల దందాపై పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫ్లాట్లు నిర్మాణం చేసి ఇస్తామని డబ్బు కట్టించుకుని మోసం చేశారని 2022 ఆగష్టులో సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ భూదాటి లక్ష్మీ నారాయణపై యశ్వంత్ కుమార్‌తో పాటు మరో 240 మంది హైదరాబాద్ సీసీఎస్కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఎండీ లక్ష్మీ నారాయణను…