Hyderabad Book Fair 2024: నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!
- నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్
- బుక్ ఫెయిర్‌ను ప్రారంభించనున్న సీఎం
- పుస్తకాలపై కనీసం పది శాతం తగ్గింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ (హెచ్‌బీఎఫ్) ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్ కొనసాగనుంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించనున్నామని చెప్పారు.
బుధవారం ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో హెచ్‌బీఎఫ్ కమిటీ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్, ప్రధాన కార్యదర్శి ఆర్.శ్రీనివాస్, కోశాధికారి పి.నారాయణరెడ్డి, ఉపాధ్యక్షుడు బాల్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర భాషా మరియు సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. బుక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈవెంట్ 11 రోజుల పాటు కొనసాగుతుంది. సందర్శకులు ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఫెయిర్‌ను చూడవచ్చు. ఈ ఏడాది తొలిసారిగా రెండు స్టేజీలను ఏర్పాటు చేయనున్నారు.
Also Read
- RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
- Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
- ‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
- Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
Also Read: R Ashwin Retirement: రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్కు ఆ ఇద్దరే కారణమా?
బుక్ ఫెయిర్ ప్రాంగణానికి మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు, సభా కార్యక్రమాల వేదికకు రచయిత్రి మరియు ప్రసిద్ధ విమర్శకురాలు బోయి విజయ భారతి, పుస్తకాల ఆవిష్కరణ వేదికకు తోపుడుబండి సాదిక్‌గా నామకరణం చేశారు. బుక్ ఫెయిర్ సందర్భంగా తెలంగాణ రుచులతో ఫుడ్ స్టాళ్లు ఉంటాయి. పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, సాంస్కృతిక ప్రదర్శనలు సహా వైద్య శిబిరాలు కూడా ఉంటాయి. పుస్తకాలపై కనీసం పది శాతం తగ్గింపును అందిస్తున్నామని హైదరాబాద్ నేషనల్ బుక్ ఫెయిర్ కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని ఆఫర్లు కూడా అందుబాటులో ఉంటాయని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
RBI SGB Redemption: గ్రాము బంగారం రూ.3 వేలకు కొన్నారు.. ఇప్పుడు లక్షకు రూ.4 లక్షలు..
-
Murmu warns: ‘ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టం’.. ఉగ్రవాదులకు రాష్ట్రపతి ముర్ము హెచ్చరిక
-
‘తప్పుడు కేసులతో వేధిస్తున్నారు’.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు
-
Matangini Hazra: జనాలు మరిచిపోయిన దేశభక్తురాలు.. దేశం కోసం ప్రాణాలిచ్చిన ఈ వీర వనిత గురించి మీకు తెలుసా?
-
Bhopal: భోపాల్‌లో షాకింగ్ ఘటన.. భర్త నైట్ షిఫ్ట్‌కు వెళ్లాక ప్రియుడితో స్టాల్‌కు వెళ్లిన ఇల్లాలు.. ట్విస్ట్ ఏంటంటే..!
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!