Nayanathra : వయసుతో పనేముంది? కుర్ర హీరోతో లేడీ సూపర్ స్టార్ రొమాన్స్.. ఓటీటీలోకి వచ్చేసిన ‘హాయ్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్ స్టార్ నయనతార, యువ హీరో కవిన్ కాంబినేషన్ లో తెరకెక్కిన విభిన్నమైన రొమాంటిక్ డ్రామా ‘హాయ్’ (Hi). నేటితరం ప్రేమ, ఆధునిక సంబంధాల్లోని సంక్లిష్టతలను అత్యంత ఆసక్తికరంగా ఆవిష్కరించిన ఈ చిత్రం, ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 (ZEE5) ఈ చిత్రాన్ని నేటి నుంచి తమిళ భాషలో ఎక్స్ క్లూజివ్ గా స్ట్రీమింగ్ చేయనుంది. సాధారణంగా నయనతార పాత్రలంటే ఎంతో బలంగా ఉంటాయి. ఈ సినిమాలో కూడా ఆమె అత్యంత ఆత్మవిశ్వాసం, స్వతంత్ర భావాలున్న యువతిగా నటించారు. అయితే బయటికి ఎంత స్ట్రాంగ్ గా కనిపించినా, లోపల మాత్రం ఎన్నో భయాలు, అంతర్గత సంఘర్షణలను మోస్తుండే నేటితరం అమ్మాయిల మనస్తత్వాన్ని ఆమె ఈ సినిమాలో అద్భుతంగా పండించారు. కుటుంబ సమస్యలతో సతమతమవుతూ, తనకు ఇష్టం లేని పెళ్లి నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించే ఓ యువతి.. అనుకోకుండా ఒక కుర్రాడిని కలిసినప్పుడు వారి జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేదే ‘హాయ్’ కథాంశం. ఈ క్రమంలో బంధాలను ఎలా స్వీకరించాలి, ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి అనే ఎన్నో అంశాలను ఈ సినిమా టచ్ చేసింది.
ఈ సినిమా ఓటీటీ రిలీజ్ సందర్భంగా నయనతార ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. “నేటి ప్రపంచంలో ప్రేమ ఎలా మారుతోంది, రిలేషన్ షిప్స్ లో ఎలాంటి సవాళ్లు వస్తున్నాయి అనేదాన్ని ఈ సినిమాలో చాలా న్యాచురల్ గా చూపించారు. ఒకరికొకరు పూర్తి భిన్నంగా ఉన్న ఇద్దరు వ్యక్తులు.. తమలోని అభద్రతా భావాలను దాటుకుని తోడు కోసం ఎలా ఒక్కటయ్యారనేది ఇందులో చూడొచ్చు. బంధాలను నిలబెట్టుకోవడంలో జరిగే లోపలి సంఘర్షణ, కుటుంబం నుంచి వచ్చే ఒత్తిడి.. ఇవన్నీ కూడా ఎంతో సహజంగా కనిపిస్తాయి. అందుకే ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుంది” అని నయన్ తెలిపారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో కవిన్ పాత్ర కూడా ఎంతో సెన్సేషనల్ గా ఉండబోతోంది. సాధారణంగా సమాజంలో మగాళ్లు ఏడవకూడదు, తమ ఎమోషన్స్ ను బయటపెట్టకూడదు అంటుంటారు. కానీ ఇందులో హీరో తన మనసులోని బాధను, ఆత్మన్యూనతా భావాన్ని దాచుకోకుండా ఫ్రీగా ఎక్స్ ప్రెస్ చేస్తాడు. ఎన్నో తిరస్కరణలు ఎదురైనా, తన జీవితంలో నిజమైన ప్రేమను పొందాలనే ఆశను మాత్రం వదులుకోని యువకుడిగా కవిన్ అద్భుతంగా నటించారు. విష్ణు ఎడవన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాధికా శరత్ కుమార్, ప్రభు లాంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషించారు. అన్నిటికంటే ముఖ్యంగా, ఇటీవలే కన్నుమూసిన దిగ్గజ దర్శకుడు, నటుడు, రచయిత కె. భాగ్యరాజ్ తెరపై కనిపించిన చివరి చిత్రాల్లో ‘హాయ్’ కూడా ఒకటి కావడం గమనార్హం. ఆయన నటన ఈ సినిమాకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును, ఎమోషన్ ను తీసుకురానుంది.
Also Read
- Yellamma: ప్రభాస్ ‘స్పిరిట్’ స్థానాన్ని భర్తీ చేసిన దేవిశ్రీ ప్రసాద్.. ‘ఎల్లమ్మ’ రిలీజ్ అప్పుడే..!
- Sharwanand: 'భోగి'తో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతా..!
- Rajinikanth - Nayanthara: 'ధర్మన్'లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
- The Prompt War: పురాణాలు, ఏఐ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. ఆకట్టుకుంటున్న పోస్టర్!
తాజావార్తలు
-
CM Revanth Reddy : జన్మనిచ్చిన గడ్డపై వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
-
Smartphone Battery Draining: స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
CM Chandrababu : రీల్స్ నుంచి బయటకు రండి.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్‌లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..