AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Excise Policy 2026-27: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీ 2026-27 అమలుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన మద్యం దుకాణాల కేటాయింపునకు లాటరీ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం 3,736 మద్యం దుకాణాల్లో 2,929 దుకాణాల రెన్యూవల్ ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 807 మద్యం దుకాణాలకు లాటరీ ద్వారా కేటాయింపు చేపట్టనున్నారు. ఇందులో 799 దుకాణాలను ఓపెన్ కేటగిరీలో, మరో 8 దుకాణాలను రిజర్వుడ్ కేటగిరీలో కేటాయించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను సెప్టెంబర్ 24న విడుదల చేసింది.
మద్యం దుకాణాల లైసెన్స్ కోసం దరఖాస్తులను ఆన్లైన్, ఆఫ్లైన్, హైబ్రిడ్ విధానాల్లో స్వీకరించనున్నారు. దరఖాస్తు చేసుకునేందుకు అక్టోబర్ 1 వరకు గడువు ఇచ్చారు. ఒక్కో దరఖాస్తుకు రూ.3 లక్షల నాన్-రిఫండబుల్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన అనంతరం అక్టోబర్ 5న లాటరీ నిర్వహించి దుకాణాలను కేటాయించనున్నారు. కొత్తగా కేటాయించే మద్యం దుకాణాల లైసెన్స్ గడువు 2026 అక్టోబర్ 1 నుంచి 2027 సెప్టెంబర్ 30 వరకు ఉండనుంది. ఈ కాలానికి సంబంధించి ఎక్సైజ్ పాలసీ నిబంధనల ప్రకారం ఎంపికైన లైసెన్సుదారులు వ్యాపారాన్ని నిర్వహించాల్సి ఉంటుంది.
Also Read
- Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
- Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
- Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
- Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
జిల్లాల వారీగా చూస్తే వైఎస్సార్ కడప జిల్లాలో అత్యధికంగా 60 మద్యం దుకాణాలకు లాటరీ నిర్వహించనున్నారు. అనంతపురం జిల్లాలో 53, విశాఖపట్నంలో 52, నెల్లూరు జిల్లాలో 51 దుకాణాలకు సంబంధించి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తంగా 807 దుకాణాల కేటాయింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అక్టోబర్ 5న జరిగే లాటరీతో ఈ దుకాణాలకు కొత్త లైసెన్సుదారులు ఖరారు కానున్నారు.
తాజావార్తలు
-
Scholarships : విద్యార్థులకు గుడ్న్యూస్.. రూ.204 కోట్ల స్కాలర్షిప్లు విడుదల
-
Amit Shah: 2029 ఘోర పరాజయానికి సిద్ధంగా ఉండు రాహుల్.. అమిత్ షా వార్నింగ్..
-
Chandrababu-Vijay Meeting: గోదావరి–కావేరీ అనుసంధానంపై ముందడుగు..? చంద్రబాబు, విజయ్ కీలక భేటీ
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!