ఎన్టీఆర్ స్టేడియంలో 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు బుక్ ఫెయిర్ ప్రారంభోత్సవానికి మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బుక్ ఫెయిర్‌లో ఏర్పాటు చేసిన బుక్ స్టాల్స్‌ను సందర్శించారు. అనంతతరం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ (హెచ్‌బీఎఫ్) ప్రారంభం కానుంది. ఎన్‌టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్ కొనసాగనుంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించనున్నామని చెప్పారు. బుధవారం ఎన్‌టీఆర్ స్టేడియం ప్రాంగణంలో హెచ్‌బీఎఫ్…
Book Fair in Hyderabad: పుస్తక ప్రియులకు శుభవార్త. హైదరాబాద్‌లో బుక్ ఫెయిర్ ప్రారంభమైంది. ఈ అవకాశం రేపటి వరకు మాత్రమే ఉంటుంది. అయితే ఇది ‘హైదరాబాద్ బుక్ ఫెయిర్’ కాదు. దీని పేరు వేరు. దీన్ని ‘కితాబ్ లవర్స్ బుక్ ఫెయిర్’ అని అంటారు. నాలుగు రోజుల పాటు కొనసాగే ఈ బుక్ ఫెయిర్ మొన్న గురువారమే ఓపెన్ అయింది. కాబట్టి రేపు ఆదివారం వరకే తెరిచి ఉంచుతారు. అందువల్ల పుస్తకాల పురుగులు త్వరపడటం మంచిది.
విజయవాడలో ప్రారంభమైన 32వ పుస్తక మహోత్సవాన్ని ఏపీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ వర్చువల్‌గా ప్రారంభించారు. స్వరాజ్య మైదానం నుంచి మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, మేయర్ భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు.ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ..పుస్తక అనువాదంతోనే భారతీయ భాషల సాహిత్యం విస్తృతం అవుతుందన్నారు. చిన్నారులకు పుస్తక పఠనం అలవాటు చేసేలా తల్లిదండ్రులు బాధ్యత వహించాలన్నారు. ఇతర భాషల నుంచి రచనలను తెలుగులోకి అనువదించి పాఠకులకు ఆయా భాషల సాహిత్యాన్ని పరిచయం చేయాలన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల సంస్కృతి,…
నగరంలో సందడి నెలకొంది. బుక్ ఫెయిర్ మళ్లీ ప్రారంభం కావడంతో నగరంలోని ఎన్టీఆర్ స్టేడియం హోరెత్తింది. ట్రాలీలు పుస్తకాల డెక్‌లను డెలివరీ చేయడం స్టాల్ నిర్వాహకులు వాటిని పూర్తి ఉత్సాహంతో ఏర్పాటు చేయడంతో, ఈసారి 34వ హైదరాబాద్ జాతీయ పుస్తక ప్రదర్శన పుస్తక ఎంపికల సాగరానికి ఎన్టీఆర్ స్టేడియం సిద్ధమైంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బుక్ ఫెయిర్ డిసెంబర్ 28 వరకు జరుగుతుంది. హైదరాబాద్, రాజమండ్రి, విజయవాడ, తెనాలి, ఢిల్లీ, ముంబై…
విజయవాడలో జనవరి 1, 2022 నుంచి జనవరి 10 వరకు బుక్ ఫెయిర్ జరగనుంది. జనవరి 1న సాయంత్రం 6 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఈ ప్రదర్శనను ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా 340 మంది పబ్లిషర్స్ ఈ బుక్ ఫెయిర్‌కు వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు తెలిపారు. 32వ బుక్ ఫెయిర్‌ను విజయవాడలోని స్వరాజ్ మైదానం లేదా శాతవాహన కాలేజీలో నిర్వహిస్తామని బుక్ ఫెస్టివల్ సొసైటీ సమన్వయకర్త డి.విజయ్ కుమార్ వెల్లడించారు. 10న ముగింపు సభ, విద్యార్థులకు…