నేటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ (హెచ్‌బీఎఫ్) ప్రారంభం కానుంది. ఎన్‌టీఆర్ స్టేడియంలో డిసెంబర్ 19 నుంచి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్ కొనసాగనుంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని హెచ్‌బీఎఫ్ అధ్యక్షుడు డా.యాకూబ్ షేక్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. సుమారు 350 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో దేశవ్యాప్తంగా ఉన్న 210 మందికి పైగా ప్రచురణకర్తలు, డిస్ట్రిబ్యూటర్ల పుస్తకాలను ప్రదర్శించనున్నామని చెప్పారు. బుధవారం ఎన్‌టీఆర్ స్టేడియం ప్రాంగణంలో హెచ్‌బీఎఫ్…