Droupadi Murmu: సువేందు సర్కార్‌కు రాష్ట్రపతి షాక్.. యాంటీ గూండా బిల్లు తిరస్కరణ
- పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి షాక్
- యాంటీ గూండా బిల్లుకు రాష్ట్రపతి అభ్యంతరం
- పునఃపరిశీలించాలంటూ తిరస్కరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘యాంటీ గూండా బిల్లు’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. బిల్లు ఆమోదానికి నిరాకరించారు. బిల్లును పునఃపరిశీలించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించారు. కేంద్రంలోని నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) చట్టంతో బిల్లులోని ఓ నిబంధనకు సంబంధం ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.
యాంటీ గూండా బిల్లు ఏంటి?
‘వెస్ట్ బెంగాల్ పబ్లిక్ సేఫ్టీ అండ్ కంట్రోల్ ఆఫ్ యాంటీ-సోషల్ యాక్టివిటీస్ బిల్-2026’ను పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ జూన్‌లో ఆమోదించింది. వ్యవస్థీకృత నేరాలు, వసూళ్లు, అక్రమ మైనింగ్, సైబర్ నేరాలు, ప్రజా శాంతికి విఘాతం కలిగించే కార్యకలాపాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు కల్పించడం ఈ బిల్లు లక్ష్యం. ‘గూండా’గా పరిగణించే వ్యక్తులపై నిరోధక చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే నిర్దిష్ట ప్రాంతం, జిల్లా లేదా జిల్లాల్లోకి ప్రవేశించకుండా ఆంక్షలు విధించే నిబంధనలు కూడా ఇందులో ఉన్నాయి.
Also Read
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Consumer Court: రూ.2 కోసం కక్కుర్తి పడితే రూ.1.06 లక్షల వాత!
- Special Summary Revision: SIR వివాదం మధ్య ఈసీ కీలక నిర్ణయం.. 17 రాష్ట్రాల్లో ఓటరు జాబితాల సవరణకు ఆదేశాలు!
- Jio Recharge: యూజర్లకు జియో షాక్.. రీఛార్జ్ ధరల పెరిగే ఛాన్స్..!
అభ్యంతరం?
బిల్లులోని సెక్షన్ 2(d)(iii)(B)లో NDPS చట్టం, 1985 కింద శిక్షార్హమైన నేరాలకు పాల్పడే వ్యక్తులను కూడా ‘గూండా’ నిర్వచనంలో చేర్చారు. అంటే మాదకద్రవ్యాల నేరాలకు పాల్పడటం, ప్రయత్నించడం, ప్రోత్సహించడం, ఆర్థిక సహాయం చేయడం లేదా సహకరించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై ఈ బిల్లు కింద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. అయితే కేంద్రం అభిప్రాయం ప్రకారం ఈ నిబంధన ఇప్పటికే అమల్లో ఉన్న కేంద్ర చట్టంతో ఓవర్‌ల్యాప్ అయ్యే అవకాశం ఉంది.
మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొనే వ్యక్తులపై నిరోధక నిర్బంధం (Preventive Detention) కోసం ఇప్పటికే ‘PITNDPS Act, 1988’ అనే కేంద్ర చట్టం ఉంది. బెంగాల్ బిల్లులోని సంబంధిత నిబంధన కూడా డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలపై ఇలాంటి నిరోధక నిర్బంధ వ్యవస్థకు దారితీయవచ్చని కేంద్రం పేర్కొంది. దీంతో ఒకే రకమైన డ్రగ్స్ సంబంధిత కార్యకలాపాలపై రెండు వేర్వేరు నిరోధక నిర్బంధ వ్యవస్థలు సమాంతరంగా అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది.
ఆర్టికల్ 254 ఎందుకు కీలకం?
కేంద్రం మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించింది. కేంద్రం, రాష్ట్రాలు రెండూ చట్టాలు చేయగలిగే Concurrent Listకు సంబంధించిన అంశాల్లో రెండు చట్టాల మధ్య విరుద్ధత ఏర్పడితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 254 ప్రకారం ‘repugnancy’ సమస్య తలెత్తవచ్చు. ఈ నేపథ్యంలో కేంద్ర చట్టంతో పునరావృతం లేదా ఓవర్‌ల్యాప్ రాకుండా బిల్లులోని సెక్షన్ 2(d)(iii)(B) నుంచి NDPS Act, 1985కు సంబంధించిన ప్రస్తావనను తొలగించాలని కేంద్రం సూచించింది.
మళ్లీ అసెంబ్లీకి
రాష్ట్రపతి బిల్లును పునఃపరిశీలన కోసం తిరిగి పంపిన నేపథ్యంలో తదుపరి చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కేంద్రం పంపిన నోట్‌ను పూర్తిగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని ఓ సీనియర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి తెలిపారు. అవసరమైన సవరణలు చేసిన తర్వాత బిల్లును మరోసారి అసెంబ్లీలో ప్రవేశపెట్టి, అనంతరం రాష్ట్రపతి ఆమోదానికి పంపే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
కీలకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఈ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందినప్పటికీ రాష్ట్రపతి ఆమోదం పొందకపోవడంతో ఇప్పటివరకు చట్టంగా అమల్లోకి రాలేదు. ఆగస్టులో కలకత్తా హైకోర్టు కూడా బిల్లుకు ఇంకా రాష్ట్రపతి ఆమోదం లభించలేదని పేర్కొంటూ దానిపై దాఖలైన పిటిషన్లను ముందస్తువిగా పరిగణించింది.

STORY | President Murmu returns Bengal’s anti-goonda bill over Centre’s drug-trafficking law overlap
President Droupadi Murmu has returned the West Bengal government’s proposed anti-goonda bill for reconsideration after objecting to a provision which may overlap with a central anti-narcotics law, an official said on Friday.
READ: https://t.co/2hWclb49ar
— Press Trust of India (@PTI_News) September 25, 2026
తాజావార్తలు
-
TDP, Jana Sena, BJP Candidates List: కూటమి సీట్ల పంపకం ఖరారు..! 17 కార్పొరేషన్లు.. 106 మున్సిపాలిటీలు.. ఏ పార్టీకి ఎక్కడంటే?
-
TG Safe Raids : ఈగలు, ఎలుకల మధ్య స్వీట్ల తయారీ.. 2,480 కిలోలు ధ్వంసం..
-
Off The Record: ఆశించినన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేక పోవడంతో జనసైనికులు డీలా..!
-
OTR : బాల్కొండ టికెట్ నాదే.. ఇంచార్జ్ ముందే ఓపెన్‌గా ప్రకటించిన మానాల మోహన్ రెడ్డి
-
OTR: ఆ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ లో కూటమిలో విభేదాలకు కారణం అవుతున్నాయా?
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!