Hyderabad: ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పరిధిలో చోటు చేసుకుంది. బాగంబర్‌పేట్‌లో రామకృష్ణ నగర్ విషాదఛాయలు అలముకున్నాయి. 50 రోజుల క్రితం రామకృష్ణ నగర్ ఇంట్లో కిరాయికి వచ్చిన భార్యాభర్తలు శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య (15) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాంనగర్‌లో ఐదు నెలల క్రితం పెద్ద కూతురు కావ్య ఉరివేసుకుని సుసైడ్ చేసుకుంది. దీంతో కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. దీంతో కుటుంబానికి చెందిన మిగతా ముగ్గురు సైతం బలవన్మరణానికి పాల్పడ్డారు.
READ MORE: CM Revanth Reddy: బాబా మనుషుల్లో దేవుడిని చూశారు.. ప్రేమతో మనుషులను గెలిచారు..
ఈ అంశంపై ఇంటి యజమాని ఎన్టీవీతో మాట్లాడారు. “శ్రీనివాస ఫ్యామిలీ 50 రోజుల క్రితం మా బిల్డింగ్ లో కిరాయికి వచ్చారు.. శ్రీనివాస్ సెక్యూరిటీ ఉద్యోగం చేస్తాడు.. మృతులు శ్రీనివాస్‌కి తన చెల్లి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.. దీంతో ఆమె వచ్చి తలుపు కొట్టింది.. ఎంత కొట్టినా తీయలేదు. కిటికీలోంచి చూసేసరికి ముగ్గురు సూసైడ్ చేసుకొని కనిపించారు. వెంటనే 100 డయల్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చాం. మృతుడు శ్రీనివాస్ చెల్లెలు పోలీసులకు స్టేట్ మెంట్ ఇచ్చింది. మేము త్వరలోనే దేవుడి దగ్గరికి వెళ్తామని శ్రీనివాస్ ఫ్యామిలీ ఆమెతో చెప్పారట.. పోలీసులు మా వద్ద నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు.. పెద్ద కూతురు ఐదు నెలల క్రితం సూసైడ్ చేసుకుంది.. అప్పటి నుంచి కుటుంబం అల్లాడుతోంది. ఈ దారుణ నిర్ణయానికి అదే ఘటన కారణం కావొచ్చని భావిస్తున్నాం. మూఢనమ్మకాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల వల్ల జరిగిందని పిస్తోంది.” అని యజమాని వెల్లడించారు.