GHMC Council Meeting: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ మీటింగ్ ఉద్రిక్తంగా మారింది. ఎంఐఎం, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. బీజేపీ, ఎంఐఎం సభ్యులు కుర్చీలపైకి ఎక్కి ఆందోళన చేశారు. మేయర్ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్‌తో బయటకు పంపుతానని అనడంతో గొడవవ సర్దుమణిగింది. కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందేమాతర గీతం ఆలాపనకు అవకాశం ఇవ్వాలని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కోరారు.. మేయర్ అంగీకారం తెలిపి.. అందెశ్రీకి…
Hyderabad: హైదరాబాద్ పాతబస్తీ శాలిబండలో సోమవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. లాల్‌దర్వాజ క్రాస్ రోడ్స్ వద్ద ఉన్న గోమతి ఎలక్ట్రానిక్స్ భవనం నిమిషాల్లోనే మంటలకు ఆహుతైంది. రెండు అంతస్తుల ఈ షోరూంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, గృహోపకరణాలు పెద్ద సంఖ్యలో ఉండటంతో మంటలు విపరీతంగా వ్యాపించాయి. రిఫ్రిజిరేటర్లు, ఏసీలు ఒక్కొక్కటిగా పేలిపోవడం వల్ల బాంబులు పడుతున్నట్టు భారీ శబ్దాలు వినిపించాయి. భవనం ముందు పార్క్ చేసి ఉన్న సీఎన్‌జీ కారు కూడా మంటల్లో చిక్కుకుని…
Hyderabad: ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ పరిధిలో చోటు చేసుకుంది. బాగంబర్‌పేట్‌లో రామకృష్ణ నగర్ విషాదఛాయలు అలముకున్నాయి. 50 రోజుల క్రితం రామకృష్ణ నగర్ ఇంట్లో కిరాయికి వచ్చిన భార్యాభర్తలు శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య (15) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాంనగర్‌లో ఐదు నెలల క్రితం పెద్ద కూతురు కావ్య ఉరివేసుకుని సుసైడ్ చేసుకుంది. దీంతో కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. దీంతో కుటుంబానికి చెందిన మిగతా ముగ్గురు సైతం…
Hyderabad: గాంధీనగర్‌లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. సికింద్రాబాద్ ప్రాంతం కవాడిగూడలో నివాసం ఉంటున్న రాజేష్ (19) అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇష్టం లేని ఉద్యోగానికి వెళ్లాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. గత వారం రోజుల క్రితమే హిమాయత్‌నగర్‌లో ప్రైవేట్ కాల్ సెంటర్లో ఉద్యోగానికి చేరాడు రాజేష్. కాల్ సెంటర్లో జాబ్ చేయడం ఇష్టం లేదని చెప్పాడు. జాబ్ చేయాలని కుటుంబ సభ్యులు తీవ్ర…
హైదరాబాద్ బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పై నుంచి దూకి పేయింటర్ ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళంకు చెందిన గోట్టివాడ చిన్న(35).. గచ్చిబౌలిలో నివాసం ఉంటున్నాడు.. భార్యతో గోడవ కారణంగా కొంత కాలంగా గచ్చిబౌలిలో చేల్లెలు ఇంట్లో నివసిస్తున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం బోటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.