Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Karimnagar Huzurabad Political War

Huzurabad Clash : హుజూరాబాద్‌లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!

Published Date :May 7, 2026 , 5:18 pm
By Gogikar Sai Krishna
  • బండి సంజయ్ పై వ్యాఖ్యలతో భగ్గుమన్న బీజేపీ
  • కౌశిక్ క్యాంప్‌పై దూసుకెళ్లిన కార్యకర్తలు
  • కర్రలతో దాడులు.. రంగంలోకి పోలీసులు
  • హుజూరాబాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు
Huzurabad Clash : హుజూరాబాద్‌లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Huzurabad : తెలంగాణ రాజకీయాల్లో మాటల యుద్ధం దాడుల వరకు వెళ్లింది. కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఎమ్మెల్యే వైఖరికి నిరసనగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా కౌశిక్ రెడ్డి క్యాంప్ కార్యాలయంపైకి దూసుకెళ్లారు.

కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై కౌశిక్ రెడ్డి చేసిన వ్యక్తిగత విమర్శలతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు తొలుత కరీంనగర్‌లో ఆందోళనకు దిగారు. అక్కడ గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉన్న కౌశిక్ రెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. పరిస్థితి విషమిస్తుందని గ్రహించిన పోలీసులు, భారీ బందోబస్తు మధ్య కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి హుజూరాబాద్‌కు తరలించారు.

Also Read

  • Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క
  • Tragedy: తీవ్ర విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా.
  • TG20 Cricket: తెలంగాణ క్రికెట్‌ లీగ్‌కు బీసీసీఐ ఆమోదం..
  • Age Relaxation: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాలకు పదేళ్లు వయోపరిమితి పెంపు..?
Add as a preferred
source on google

కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ చేరుకున్నాక, అక్కడ కార్యకర్తలతో సమావేశమవుతుండగా బీజేపీ శ్రేణులు ఒక్కసారిగా క్యాంప్ కార్యాలయంలోకి చొచ్చుకొచ్చే ప్రయత్నం చేశారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేపీ కార్యకర్తలను కౌశిక్ రెడ్డి అనుచరులు కర్రలతో అడ్డుకున్నారు. పోలీసుల కళ్లముందే ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకోవడంతో పరిస్థితి అదుపు తప్పింది. బీఆర్‌ఎస్ శ్రేణులు కర్రలతో దాడి చేయగా, బీజేపీ శ్రేణులు ప్రతిదాడికి దిగాయి.

పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీసులు రంగంలోకి దిగి కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేశారు. ఘర్షణకు కారణమైన బీజేపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మరోవైపు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు బయటకు రాకుండా పోలీసులు క్యాంప్ కార్యాలయ గేట్లు వేసి లోపలే ఉంచేశారు. ఈ ఘటనపై పాడి కౌశిక్ రెడ్డి స్పందిస్తూ.. తనపై హత్యాయత్నం జరిగిందని, రాడ్లు, కత్తులతో దాడులు చేశారని ఆరోపించారు.

ప్రస్తుతం హుజూరాబాద్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. రాజకీయ పక్షాల మధ్య నెలకొన్న ఈ ఉద్రిక్తతలతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికార, ప్రతిపక్షాల మధ్య సాగుతున్న ఈ ఘర్షణలు జిల్లాలో శాంతిభద్రతలపై చర్చకు దారితీశాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • bjp telangana
  • BRS
  • huzurabad
  • padi kaushik reddy

తాజావార్తలు

  • Huzurabad Clash : హుజూరాబాద్‌లో పొలిటికల్ వార్.. కౌశిక్ రెడ్డి వర్సెస్ బీజేపీ శ్రేణులు..!

  • Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?

  • Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..

  • Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions