భార్యను హతమార్చి ఫేస్‌బుక్ లైవ్ స్టేటస్ పెట్టిన భర్త కలకలం రేపుతోంది. భార్యను హతమార్చిన అనంతరం భర్త కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మహదేశ్వర కొండ నాగమలె వద్ద చోటు చేసుకుంది. తమిళనాడులోని ధర్మపురి జిల్లా ఎర్రభయ్యనహళ్లికి చెందిన మునిరాజు-లక్ష్మి దంపతులు. అయితే.. భార్య లక్ష్మిపై మునిరాజుకు అనుమానం ఉండేది. భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమెను వేధించేవాడు. ఈ విషయమై పలుమార్లు గొడవలు జరిగినట్లు సమాచారం.
Also Read : Vivek Ramaswamy: అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో భారత సంతతికి చెందిన వ్యక్తి
అయితే.. ఈ క్రమంలోనే భార్య లక్ష్మిని రాయితో కొట్టి హత్య చేసి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అనుమానిస్తున్నారు. అయితే.. ఈ హత్యాకాండను మునిరాజు ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టడం షాకింగ్‌కు గురి చేసింది. ఫేస్‌బుక్‌లోనే కాకుండా.. వాట్సప్‌లోనూ స్టేటస్ పెట్టాడు. తన వాట్సాప్, ఫేస్‌బుక్ స్టేటస్ లో భార్యను హత్య చేసి రక్తపుమడుగులో ఉన్న శవాన్ని వీడియో తీసి పెట్టాడు. అయితే.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో.. చమరాజనగరా పోలీసులు దర్యాప్తు చేసి కేస్ నమోదు చేశారు.
Also Read : High Court : కుక్కల దాడిలో బాలుడు మృతి కేసు.. సుమోటోగా విచారణకు హైకోర్టు