Crime News: మూడు పెళ్లిళ్లు చేసుకున్నా ఆమె కథ మారలేదు.. చివరికి ఏమైందంటే..?
- యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు
- టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపణ
- పెళ్లయినప్పటి నుంచి కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్న పేరెంట్స్
- భర్తతో పాటు కుటుంబ సభ్యులను విచారిస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ఝాన్సీలో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ఒక మహిళ తన భర్త, అత్తమామల ప్రేమను పొందడానికి ఒకసారి కాదు మూడు సార్లు వివాహం చేసుకుంది. అయినప్పటికీ ఆమె జీవితంలో ఆనందం కరువైంది. చివరికి ఆ మహిళ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లింది. టాయిలెట్ క్లీనర్ తాగించి తన కుమార్తెను భర్త, అత్తమామలు హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పెళ్లయినప్పటి నుంచి భర్త తనను కొట్టి డబ్బులు డిమాండ్ చేసేవాడని చెబుతున్నారు. ఈ క్రమంలో టాయిలెట్ క్లీనర్ తాగించి హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై భర్తతో పాటు కుటుంబ సభ్యులను పోలీసులు విచారిస్తున్నారు.
IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీ
Also Read
- Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
- CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
- Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
- Samsung A07: HD+ PLS LCD డిస్ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
వివరాల్లోకి వెళ్తే.. ఓర్చా గేట్ ప్రాంతానికి చెందిన దుర్గా దేవికి ఉన్నావ్ గేట్ ప్రాంతానికి చెందిన రాహుల్ అనే యువకుడితో వివాహం జరిగింది. జూన్ 18న ఇంట్లో భర్తతో గొడవపడి, అత్తమామలు దుర్గాదేవిని బలవంతంగా టాయిలెట్ క్లీనర్ తాగించారని, దీంతో ఆమె పరిస్థితి విషమించిందని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. పరిస్థితి విషమించడంతో ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో.. అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే.. డబ్బుల కోసం భర్త తరచూ కొట్టేవాడని మహిళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త రాహుల్ చీరల దుకాణంలో పనిచేసేవాడని.. అతను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయాడని పేర్కొన్నారు. దీంతో తల్లి ఇంటి నుంచి డబ్బులు తీసుకురావాలని భార్యను తరచూ డిమాండ్ చేసేవాడని చెప్పారు.
UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 80 పైగా మృతి..
ఇదిలా ఉంటే.. మృతురాలు దుర్గాదేవికి ఒకటి కాదు మూడు పెళ్లిళ్లు అయ్యాయి. ముగ్గురితో సంసారం ఎక్కువ కాలం నిలవలేదు. దుర్గాదేవి మొదటి వివాహం 11 సంవత్సరాల క్రితం మహోబాలోని చరఖారీలో జరిగింది. మొదటి భర్త మద్యానికి బానిస కావడంతో.. మద్యం సేవించి తరచూ ఆమెను కొట్టేవాడు. అయితే.. ఆ సమయంలో ఆమెకు ఒక కుమార్తె ఉంది. ఆ తర్వాత కూడా భర్త తాగుడు మానకపోవడంతో విడాకులు తీసుకుంది. అనంతరం.. ఐదేళ్ల క్రితం మరో వ్యక్తితో పెళ్లి చేశారు. అయితే.. అతను వేరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దీంతో.. ఏడాది పాటు సహజీవనం చేసి అతని నుంచి విడిపోయింది. ఆ తర్వాత.. 2021లో రాహుల్‌తో మూడో పెళ్లి చేసుకుంది. రాహుల్‌కి కూడా ఇది రెండో పెళ్లి.
తాజావార్తలు
-
Former OSD Sumanth : మాజీ OSD సుమంత్‌కు బిగ్ రిలీఫ్.. ముందస్తు బెయిల్.!
-
TG SAFE : కూకట్‌పల్లిలో ఫుడ్ సేఫ్టీ రైడ్స్.. 5 లైసెన్సులు సస్పెండ్..!
-
World EV Day 2026: Ather నుంచి Bajaj Chetak వరకు బెస్ట్ ఆప్షన్స్ ఇవే.. రేంజ్, ధర వివరాలు
-
Mamata Banerjee: బైపోల్ బరిలోకి మమతా బెనర్జీ!.. పోటీపై సర్వత్రా ఉత్కంఠ..!
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు.. రేపటి నుంచి రెండు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!